
హమాలి కార్మికుల సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి
హమాలీ కార్మికుల సంక్షేమం కోసం తక్షణమే వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆల్ హామాలి వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
జిల్లా కలెక్టరేట్ ప్రజావాణి లో జిల్లా అదనపు కలెక్టర్ సుభాషిని గారికి హమాలి యూనియన్ జిల్లా నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాపర్తి రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది ప్రభుత్వ ప్రైవేటు సంస్థలలో పనిచేస్తున్న హమాలి కార్మికులు ఉన్నారని తెలిపారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ది ఉత్సవాలు జరుపుకున్న హమాలి కార్మికులకు మాత్రం ఒరగబెట్టిందేమీ లేదని అన్నారు ఎన్నో ఏళ్లుగా హమలి కార్మికులు తమ సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని పోరాటం చేస్తున్నారని తెలిపారు అయినప్పటికీ హమాలి కార్మికుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమాలి కార్మికుల సంక్షేమం కోసం హెల్పర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు హమాలి కార్మికులందరికీ ప్రభుత్వం గుర్తింపు కార్డులు ,హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు ప్రమాద బీమా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని అన్నారు 50 ఏళ్లు దాటిన హమాలి కార్మికులకు నెలకు 6000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సామాజికంగా అట్టడుగు వర్గాలకు చెందినటువంటి హమాలి కార్మికుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూడడం సరైనది కాదని అన్నారు సమాజంలో ప్రజలకు కావలసినటువంటి వస్తువులు ఆహార ధాన్యాలు ప్రతి నిత్యవసర సరుకులు ప్రజలకు చేరవేయడానికి హమాలి కార్మికులకు కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న హమలి కార్మికుల కోసం ప్రభుత్వం వెంటనే వెలుపర బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు వెల్ఫేర్ బోర్డు సాధన కోసం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా హమాలి కార్మికుల ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో ఆల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్యాల సోమన్న జిల్లా సహాయ కార్యదర్శి బైరగొని బాలరాజ్ జిల్లా నాయకులు పాండ్యాల అంజయ్య జి రాజు కూరాకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.