
కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తీసుకురావడమే మా ద్యేయం.
ఈ రోజు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి మరియు టీపీసీసీ మాజీ అధ్యక్షులు మాజీ మంత్రి వర్యులు శ్రీ పొన్నాల లక్ష్మయ్య ఆదేశాల మేరకు. జనగామ మండలం గానుగుపహాడ్ గ్రామంలో కాంగ్రేస్ గ్రామ శాఖ అధ్యక్షులు ముక్కెర యాదగిరి గారి, మరియూ జనగామ మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండి యాసిన్ అధ్యక్షతన జనగామ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేయాలని కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పేద ప్రజలకు ఆరోగ్య శ్రీ ద్వారా 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యము మరియు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన వెంటనే ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫి,పండించిన పంటకు గిట్టుబాటు ధర,500 రూపాయలకు గ్యాస్ ,రేషన్ ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ,సొంత ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల ఆర్థిక సహాయం, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ,రైతు కూలీలు ,భూమి లేని రైతులకు సైతం రైతు భీమా పథకం,వివిధ కారణాలతో పంట నష్టపోతే తక్షణం నష్టపరిహారం అందేలా పటిష్టమైన పంట భీమా పథకం. ప్రజల సంక్షేమం కోసం అందించే పథకాలను వివరిస్తూ డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యకరమానికి ముఖ్య అతిథిగా జనగామ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట క్రాంతి కుమార్, జనగామ మండల యుత్ కాంగ్రెస్ అధ్యక్షులు బాల్నే నరేశ్ గౌడ్ ,కాంగ్రేస్ పార్టీ మండల అధ్యక్షులు కొన్నే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సలేంద్ర శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఎండి సర్వర్,యూత్ కాంగ్రేస్ మరియూ సీనియర్ నాయకులు బండ విజయ్,శివ,రెడ్డబోయిన మధు, గిరాబోయిన కార్తిక్,బబ్బురి సత్తయ్య,దండల ప్రకాష్, దరిగా సంపత్,గుర్రం ఉషయ్య,ఎండి నసార్, ముక్కెర కనకరాజు తదితరులు పాల్గొన్నారు