
చందమామపై కాలుమోపిన విక్రమ్ ల్యాండర్
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అవడంతో హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
చందమామపై భారత్ చెరగని ముద్రవేసిందని చరిత్రాత్మక ఘట్టంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సరికొత్త చరిత్రను లిఖించిందని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తుండగా.. కోట్లాది భారతీయుల ప్రార్థనలు ఫలించగా.. చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 మిషన్ ‘ల్యాండర్ విక్రమ్’ విజయవంతంగా సాఫ్ట్‌గా ల్యాడ్ అవడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు.
చంద్రుడిపై పరిశోధనల కోసం గత నెల 14న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 వ్యోమనౌక 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత జాబిల్లిపై అడుగుపెట్టింది. బుధవారం సాయంత్రం 6:04 గంటలకు ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ చంద్రుని దక్షిణ ధ్రువాన్ని ముద్దాడింది. దీంతో అమెరికా, సోవియెట్ యూనియన్ (రష్యా), చైనా తర్వాత చంద్రునిపై దిగిన నాలుగో దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. అలాగే ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యంకాని జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగా భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఇంతటి మహత్తర కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన శాస్త్రవేత్తలకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శుభాకాంక్షలు తెలిపారు. మున్ముందు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు