
నిరుద్యోగులకు సమయం ఆసన్నమైంది
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులారా ఎమ్మెల్యే లుగా పోటీ చేసే సమయం ఆసన్నమైనదని నడిగూడెం మండల కేంద్రం లోని బృందవనపురం గ్రామానికి చెందిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు బెల్లంకొండ నవీన్ పిలుపునిచ్చారు.శుక్రవారం ఆయన ఒక పత్రిక ప్రకటన లో మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమ నినాదం నీళ్ళు, నిధులు, నియామకాలు ఆ నినాదాలు ఎక్కడికి పోయినవో ఒక్కసారి ఆలోచన యువత చేయాలాన్నారు.తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన కెసిఆర్ రాష్ట్రం లో ఇంటికో ఉద్యోగం,నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని ఇచ్చిన హామీలు విస్మరించారని గుర్తు చేశారు. రాష్ట్రం లో పేపర్ లీకేజీలు -ప్యాకేజీలు,కోర్టుకు పోకుండా ఏ నోటిఫికేషన్ సాఫీగా సాగలేదని,పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్లో లేని పోని నిబంధనలు తెచ్చి లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.నూతన జోనల్ వ్యవస్థ వల్ల ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు భారీ నష్టం జరిగిందన్నారు.వేల సంఖ్యలో టీచర్స్ పోస్టులు ఖాళీగా ఉన్న భర్తీకి నోచుకోవడం లేదని, గురుకుల నియామకాల్లో లేని పోని నిబంధనలతో పురుష అభ్యర్థులకు భారీ కోత చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదన్నారు.30 లక్షల మంది నిరుద్యోగులకు ఎదో ఒక భరోసా కలిపించండి లేకుంటే నిరుద్యోగుల కుటుంబాల ఓట్లు 90 లక్షల వరకు ఉంటాయని ప్రభుత్వాని కులాగొట్టడం పెద్ద సమస్య కాదని ఆయన తెలిపారు.119 నియోజకవర్గాలలో ప్రతి నియోజక వర్గం నుంచి 100 మంది చొప్పున నిరుద్యోగులు ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్లు వేసే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.