
బిజెపిని ఓడిస్తేనే యువతకు ఉద్యోగాలు
దేశంలోని నిరుద్యోగం పెరుగుతున్న బిజెపి ప్రభుత్వం దాన్ని పెంచి పోషిస్తుంది తప్ప యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలం అయిందని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ అఖిల భారత కార్యదర్శి హిమాగ్ని రాజ్ భట్టాచార్య విమర్శించారు.హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యా ఉపాధి పై రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలోని నిరుద్యోగ యువతకు ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బిజెపి ప్రభుత్వం, ఇచ్చిన హామీని నెరవేర్చలేక పోయిందని, విదేశాల్లో నల్లధనం తీసుకువచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తామని, చెప్పి ఒక్క రూపాయి కూడా వెనక్కి తీసుక రాలేకపోయింది, పెద్ద నోట్ల రద్దు తో దేశానికి ఏమి ఉపయోగం జరగలేదని, జీఎస్టీ వల్ల ప్రజలపై భారాలు పెరిగాయి, ఉపయోగం లేకపోవడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని, కరోనాతో లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారని, వారిని ఎందుకు ఆదుకోలేకపోయారని, మత ఉద్రిక్తతలను రెచ్చగొడుతూ, బిజెపి రాజకీయం చేస్తుంది తప్ప, యువతకు ఉపయోగ వచ్చే ఏ పని చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వ శాఖల్లో ఏళ్ల తరబడి ఉద్యోగాలు ఖాళీగా ఉన్న వాటిని ఎందుకు భర్తీ చేయడం లేదని, కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్పొరేట్ సంస్థలు వ్యక్తులకు లాభం చేకూర్చే విధంగా ఉన్నాయి, పేద ప్రజల ఇబ్బంది పెట్టే పని చేస్తుందని నిత్యవసర వస్తువులను ధరలను అదుపు చేయ లేకుండా పోయిందని, ధరలు పెరుగుతుంటే ఎందుకు చూస్తుందని, ప్రశ్నించారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వంతో యువతకు జరిగింది శూన్యమైన అని, ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చిన పేపర్ లీకేజీలు తో సరిపుచ్చుకుందని, ఏ ఒక్క నోటిఫికేషన్ సక్రమంగా నిర్వర్తించలేకపోగా కోర్టులో కేసుల్లో పెండింగ్లో పడిపోయాయని అన్నారు. బిజెపి, బిఆర్ఎస్ విధానాలు ఒకటేనని వాటిని ఓడిస్తేనే దేశం లో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఉపాధి కోసం జరుగుతున్న ఉద్యమంలో యువత భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఈ రాష్ట్ర సదస్సుకు డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ అధ్యక్షతన వహించారు. డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్ మాట్లాడారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వని ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.ఈ సదస్సులో డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి బషీర్ , జి తిరుపతి నాయక్ , గడ్డం, రోషన్ బేగం వెంకటేష్, సహాయ కార్యదర్శులు గొడిశాల కార్తీక్, జగన్, కొంటూ సాగర్, డి.సాంబమూర్తి, హనుమకొండ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్, కార్యదర్శి దోగ్గెల తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షులు మంద సుచందర్, సహాయ కార్యదర్శులు మంద సురేష్ ఓర్సు చిరంజీవి చిట్యాల విజయకుమార్, జిల్లా నాయకులు మౌనిక, కర్ణాకర్, యువన్, చామంతి శివాని, జంపయ్య, అనీల్ లు పాల్గొన్నారు.