కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పాటిగడ్డ బస్తీలో నిరసన
HyderabadCPM పార్టీ సనత్ నగర్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో బేగంపేట డివిజన్లోని పాటిగడ్డ బస్తీలో నిరసన , నిత్యవసర సరుకులు ఉపాధి ఉద్యోగం, నిరుద్యోగం, విద్య, వైద్యం మహిళా, యువత తదితర రంగాల్లో పనిచేస్తున్న, యావత్ ప్రజానీకా సమస్యలు పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ అధిక ధరలు నిరుద్యోగం ఉపాధి కుదింపునకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 1 నుండి 7 వరకు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా సనత్ నగర్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగిందని సిపిఎం జోన్ కన్వీనర్ జి నరేష్ తెలిపారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ దేశంలో రోజురోజుకీ నిత్యవసర సరుకుల ధరలు హద్దు అదుపు లేకుండా పెరుగుతున్నాయని , దేశంలో కోట్లాదిమంది ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారని వీరిపై పన్నుల భారం పెంచి మరింత దారిద్రంలోకి నట్టుతున్నారని, ఇదే అదునుగా వ్యాపారస్తులు కృత్రిమ కొరతను సృష్టించి ధరలు మరింత పెంచుతున్నారు .ధరలు అదుపు చేయాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ల కొమ్ముకాస్తుందని, నిత్యవసర సరుకులపై 12 నుండి 18% పనులు వేయడంతో అనివార్యంగా ధరలు పెరుగుతున్నాయని, , విద్యా, వైద్యం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ, ప్రజలు అప్పులు చేస్తూ వడ్డీ కూరల్లో చిక్కుకుంటున్నారని ,పన్నులు తగ్గించడం ద్వారా ధరలు తగ్గుతాయని సిపిఎం వామపక్షాలు ఆందోళన లు చేస్తున్నాయి . గతంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నేటికీ ఇవ్వకపోవడం, మోడీ ప్రభుత్వం కార్పొరేటర్ పక్షాన ఉంటూ రాయితీ ఇస్తూ ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తూ కార్పొరేట్లకు లాభాలు కట్టబెడుతూ పనుల భారాన్ని పేదలపై పెద్ద ఎత్తున పెంచుతున్నారు. పరోక్ష పన్నులు అదనంగా జిఎస్టి వేస్తూ ప్రజలపై మరిన్ని బారాలు మోపుతున్నారు. పేదలపైనే బారాలు మోపుతూ దళిత గిరిజన వృత్తి దారుల, మైనార్టీలను ఇబ్బందులకు నెట్టడం జరుగుతోంది .కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు,ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఎం పార్టీ నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జోన్ నాయకులు పి. మల్లేష్ , నాయకులు అల్వాల్ బాబు, పరశురాములు, రాములు తదితరులు పాల్గొన్నారు.