
గర్భిణీలు బాలింతలు తప్పనిసరిగా పోషకాహారం తీసుకోవాలని మరిపెడ ఐసిడిఎస్ సిడిపిఓ శిరీష సూచించారు. సోమవారం మండలంలోని అబ్బాయి పాలెం గ్రామ శివారు (పత్తికొండ తండా) అంగనవాడి కేంద్రంలోని బాలింతలు గర్భిణీలకు పోషణ్ మాసం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిడిపిఓ శిరీష మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు బాలింతలు తప్పకుండా అంగన్వాడి కేంద్రాలలో పేరు నమోదు చేసుకోవాలని వారందరికీ ప్రభుత్వం అందిస్తున్న పోషక ఆహారాలు తప్పనిసరిగా మీకు అందుతాయన్నారు. గుడ్లు, పప్పు ,ఆకుకూర, పాలు అంగన్వాడి కేంద్రాల్లో అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. అంగన్వాడి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అబ్బాయిపాలెం సెక్టర్ సూపర్వైజర్ విజయలక్ష్మి, అంగన్వాడి టీచర్లు బెస్త సంపూర్ణ, కామిండ్ల లక్ష్మీకాంత, మద్దోజ్ కృష్ణకుమారి, ధరావత్ లలిత, అలవాల సత్యవతి, అంగన్వాడీ వర్కర్లు, ఆశా కార్యకర్తలు, గర్భిణి స్త్రీలు బాలింతలు విద్యార్థులు పాల్గొన్నారు.