తీజ్ పండుగ ప్రశాంతంగా నిర్వహించుకోవాలి ఫలకనుమా ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర
Hyderabadరవీందర్ నాయక్ నగర్ కాలనీ బంజర వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో తీజ్ పండుగ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఫలక్నుమా ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఫలకనుమా ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర మాట్లాడుతూ…. తీజ్ పండుగ అనేది గిరిజనుల సాంస్కృతి ఆచారాల పండుగ రవీంద్రర్ నాయక్ నగర్ కాలనీ ప్రజలు తీజ్ పండుగ నిర్వహిస్తున్నామని చెప్పగానే చాలా సంతోషంగా కానీ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎలాంటి సంఘటనలు జరగకుండా రవీంద్ర నాయక్ నగర్ కాలనీ ప్రజా నిర్వహించుకోవలని తీజ్ పండుగ నిర్వహణ కమిటీ సభ్యులు అనేక జాగ్రతలు పాటించాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. మరియు రవీంద్ర నాయక్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ మాట్లాడుతూ… గిరిజనుల సాంస్కృతి ఉనికిని కాపాడాలని ఉద్దేశంతోటే రవీందర్ నాయక్ నగర్ కాలనీలో తీజ్ పండుగను నిర్వహించుకోవడం జరుగుతుంది
తీజ్ ఒక ప్రత్యేకమైన పండుగబంజారాల సాంప్రదాయం ప్రకారం వివాహం కాని అమ్మాయిలు తండాలో ఎంత మంది ఉంటే అంతమంది తమ బుట్టలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పందిరిపై ఉంచుతారు. యువతుల్లో ఒకరు తమ బృందానికి నాయకురాలిగా వ్యవహరిస్తారు. ఈ తొమ్మిది రోజులపాటు ఎంతో భక్తి శ్రద్ధలతో మూడు పూటలు నీరు పోస్తారు. ఈ నారు అత్యంత పవిత్రమైందని, దీనివల్ల శుభం జరుగుతుందని నమ్మకం. తీజ్ బుట్టలను పట్టుకొని తొమ్మిదో రోజున వరుసగా ఆడపిల్లలు నిమజ్జనానికి డప్పుచప్పుళ్లతో బయలుదేరుతారు.
ఈనెల సెప్టెంబర్1వ తేదీ నుండి 10 తేదీ వరకు తీజ్ మొలకల బుట్టలు నిమజ్జనం రాజన్నబౌవి లో నిమజ్జనం ఉంటుంది. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నలని ఈ సందర్భంగా తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్నారు ఫలక్నామ సబ్ ఇన్స్పెక్టర్ మహేష్ మరియు రవీంద్ర నాయక్ నగర్ కాలనీ నాయకులు లచ్చి రామ్ నాయక్ రామ్ కుమార్, రాజు నరేందర్ నాయక్ శ్రీను రాజేష్ కృష్ణ సోమా శంకర్ భూరో ఆంజనేయులు. సంతోష్ రెడ్యా మహేష్ చంద్ర నవీన్ చిన్న