
పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతాం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల భాగ్యసామ్యంతో ఐక్య పోరాటాలు నిర్వహిస్తామని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న. మండల కార్యదర్శి మాచర్ల సారయ్యలు అన్నారు. బుధవారం పాలకుర్తి మండల కేంద్రంలోని గూడూరు. మంచ్చుపుల గ్రామంలోకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనలు వ్యక్తం చేసి అనంతరం సిపిఎం జెండాను కాకర్ల బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు పాల్గొని మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాల నుండి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉండి ప్రజలను తిరోగమన వైపు నడిపిస్తుందని. కుల మతాల విద్వేషాలను రెచ్చగొట్టి మత చిచ్చు పెడుతుందన్నారు. దేశభక్తి పేరుతో దేశంలో ఉన్న అన్ని నిత్యవసర సరుకుల ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తుంది అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తుండడంతో గ్యాస్ ధర తగ్గించారని పెంచింది కొండైతే తగ్గించింది గోరంత అని ఎద్దువ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలుభూమి పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మరిచారని. గృహలక్ష్మి పథకానికి ఇప్పటికీ మోక్షం లేదన్నారు. దళిత బిసి మైనార్టీ బందు అని కొద్దిమందికి ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని. దరఖాస్తు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పదేండ్ల కాలంలో నిత్యవసర సరుకులపై పెంచిన ధరలు తగ్గించాలని.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజు, సంపత్, శ్రీను, మల్లేష్, బయన్న, కుమార్, కాకర్ల బాబు, బి వెంకన్న, జి లక్ష్మి, కే సోమయ్య, పి ఐలయ్య, మల్లయ్య, బిక్షం, సోమన్న, యాదమ్మ, రేణుక, లక్ష్మి ,ప్రవీణ్, మహేష్, యాకయ్య, బాలమ్మ, యాకమ్మ తదితరులు పాల్గొన్నారు.