యూసఫ్ గూడా లేబర్ అడ్డా వద్ద జరిగిన సమావేశంలో సిఐటియు నగర నాయకులు డిఎల్ మోహన్, రాజు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులందరికీ మోటర్ బైక్స్ ఇవ్వాలని, ఇన్సూరెన్స్ కార్డులు అందరికీ షరతులు, వేలిముద్ర లేకుండా అప్లికేషన్లు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తుఫాన్ వల్ల వర్షాలు పడుతున్నాయి వారం రోజులుగా పనులు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి కార్మికులను ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 25 కేజీల రైస్ ఇచ్చి ఆదుకోవాలి, పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించి కార్మికులకు పని కల్పించాలని ఇల్లు లేని కార్మికులందరికీ డబల్ బెడ్ రూమ్ లో ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది హైదరాబాద్ నగరంలో పనులు లేక సిటీ అవుట్ కార్డ్స్ దూర ప్రాంతంలోకి వెళ్లాల్సి వస్తా ఉంది కావున లక్ష బైకులు ఇస్తామని చెప్పిన మంత్రి మల్లారెడ్డి గారి ఇంటికి లేబర్ ఆఫీసు ముట్టడి చేస్తామని భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు రాపర్తి అశోక్ దుర్గాప్రసాద్ ,కృష్ణ ,ముత్తయ్య లక్ష్మి,,తిరుపాలు ,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.