
స్వార్థ ప్రయోజకుడు నాయిని
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడడానికి నాయిని రాజేందర్ రెడ్డి కారణమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మురతోటి అనిల్ కుమార్ ఆరోపించారు. గురువారం హనుమకొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పడిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నర్సంపేట జడ్పిటిసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దయాకర్ రావుకు అమ్ముకొని వారికి సహకరించారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా బడుగు బలహీన వర్గాలకు చెందిన హౌసింగ్ బోర్డ్ ద్వారా 5000 ఇండ్లను మంజూరు చేస్తే వాటిలో అక్రమాలకు పాల్పడి వాటిని బినామీలకు కట్టబెట్టి హౌసింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏఈ మరియు డి ఈ ఉద్యోగాలు కోల్పోయి వాళ్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి దానికి కారణం నాయిని రాజేందర్ రెడ్డి పరువు తీసేయాలని ఆయన ఆరోపించారు. కాకతీయ యూనివర్సిటీ కి చెందిన మూడున్నర ఎకరాల భూమిని కూడా కబ్జా చేసి విక్రయించారనిఅన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జడ్పిటిసి సభ్యులు ఎల్ఐసి వెంకన్నని 30 లక్షలకు అప్పటి జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి బసవ రెడ్డికి అమ్ముకోవడంతో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీ ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ కోల్పోవాల్సి వచ్చిందని తెలిపా రు. దేవరపల్లి మండలం ఎంపీటీసీలను తెలుగుదేశం పార్టీకి చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఎంపీటీసీ బీఫాంలో అమ్ముకోవడం వలన ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోవాల్సి వచ్చిందన్నారు. 2009లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గుర్తించి కొండపల్లి దయాసా గర్ కి టికెట్ ఇస్తే పార్టీ ఎమ్మెల్యే దగ్గర డబ్బులు తీసుకొని ప్రతి డివిజన్లో డివిజన్ ప్రెసిడెంట్ లతో బిఆ ర్ఎస్ పార్టీకి ఓటు వేయించాలని డబ్బులు పంపించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించారు. వరంగల్ జిల్లా గ్రంధాలయం చైర్మన్‌గా ఉంటూ యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులను రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ నాకే వస్తుంది కాబట్టి దయాసాగర్ గారిని ఓడించాలని చెప్పి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ కోర్టు గా మారి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు కోసం తన మిత్రుడు వడ్డేపల్లి చిన్నతో తన క్లబ్బులో ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిస్తే నాకు గ్రంథాలయం పదవి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నా రని కార్యకర్తలకు నమ్మేలా డబ్బులు తీసుకుని అమ్ము డుపోయి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించా రు. మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ కు 2014లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిస్తే బిజెపి పార్టీకి అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించారు. 2018 లో జరిగిన వరంగల్ మున్సిపల్ ఉప ఎన్నికల్లో న్యాయని రాజేందర్ రెడ్డి మీద ఉన్న కేసులు ఎత్తివేయడానికి టిఆర్ఎస్ పార్టీతో లాలూచీపడి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షు డిగా ఉంటూ తను నివసించే డివిజన్లో కూడా పార్టీ తరఫున అభ్యర్థిని కూడా పెట్టలేక కాంగ్రెస్ పార్టీ పరు వు తీశారు. 2018లో పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి చెందిన రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే రేవూరి ప్రకాష్ రెడ్డి దగ్గర నాలుగు కోట్లు తీసుకోవడమే కాకుండా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ దగ్గర డబ్బులు తీసుకొని టిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసి రేవూరి ప్రకాష్ రెడ్డిని ఓడించారు. హనుమకొండ జిల్లా ప్రజలు విద్యావంతులు మేధా వులు నాయిని నాగేందర్ రెడ్డి చరిత్రను మర్చిపోలేరని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. కన్నతల్లి కాంగ్రె స్ పార్టీ అభ్యర్థులను ఓడించడం స్థానిక ఎన్నికలు వ చ్చినప్పుడు పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ కార్పొరేట ర్ అభ్యర్థులకు వెన్నుదన్నుగా ఉండకుండా వారి ప్రచా రాలకు వెళ్లకుండా నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీని అట్టడుగు స్థాయికి చేర్చి ఇప్పుడు ఎన్నికలు సమీపి స్తున్న తరుణంలో ఎమ్మెల్యే టికెట్ కావాలని హడా వుడి చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన వెంటనే డబ్బులు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి మోసం చేయాలనే ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు అనిల్ కుమార్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. నాయిని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వరంగల్ పశ్చి మ నియోజకవర్గంలో బలమైన నాయకులను రానివ్వ కుండా అడ్డుపడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయకపో తే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని ఎమ్మెల్యే టికె ట్ ఇస్తే డిపాజిట్ కూడా రాదని అధిష్టానానికి పత్రిక తెలియజేశారు. పొరపాటున ఆయనకు టికెట్ ఇస్తే బంగారు పళ్లెంలో టిఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే పదవి ఇచ్చినట్టేనని ఆయన తెలిపారు.