
కనపర్తి గ్రామ రహదారికి మోక్షమేప్పుడు
ఇది ఎక్కడో మారుమూల గ్రామం కాదు బాగా అభివృద్ధి చెందిందని డప్పుకొట్టుకునే భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం లోని కనపర్తి గ్రామం
కనీస అవసరమైన గ్రామానికి వచ్చే దారి బాగా లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు గ్రామ ప్రజలు……..
లీడర్లకు కనిపించడం లేదా కనిపించినా ఏమౌతుందిలే ఎలక్షన్ వరకు 1000/- రూపాయలిస్తే వాళ్ళే వోట్ వేస్తారు లే అని భరోసా కావచ్చు, కనీసం ఎవరికైనా ఆపద వస్తే అంబులెన్సు 15 కిలోమీటర్లు తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఒక సంవత్సరం క్రితం బాగానే ఉన్న రోడ్డును డబల్ రోడ్డు వేస్తామని మంచిగా ఉన్న రోడ్డు ని తవ్వేశారు, మీద ఉన్న డాంబర్ అంతా తవ్వేసరికి ఉన్న మట్టి రోడ్డు మొత్తం మొన్నటి వర్షాలకు కొట్టుకు పోయింది ……..
పని మొదలైన రోడ్డు ఎందుకు మధ్యలోనే ఆగిపోయిందో గ్రామ ప్రజలకు అర్దంకావడం లేదు.
ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి రోడ్డు పనులు ప్రారంభించాలాని ప్రజలు కోరుకుంటున్నారు.