
గ్రామీణ ప్రాంతాలు, తండాల రోడ్లు కు మాహార్దశ
గిరిజన తండాలకు మహర్దశ పట్టిందని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. ఇప్పటికే తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ప్రభుత్వం బీటీరోడ్ల నిర్మాణానికి భారీగా నిధులు మంజూరు చేసిందని మంత్రి తెలియజేశారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ట్రైబల్ వెల్ఫేర్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గిరిజన సంక్షేమ శాఖ నుండి రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ఆవాసాలకు రోడ్ల నిర్మాణం కోసం అత్యధిక నిధులు కేటాయించామని స్పష్టం చేసారు. తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన ఆవాసాలకు రహదారిలో సౌకర్యం కల్పించడానికి 2022 – 23 సంవత్సరంలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా STSDF నుండి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1582 పనులకు 3,174 కిలోమీటర్లు గాను 2,059.27కోట్ల నిధులు మంజూరు ఇచ్చామని తెలిపారు,ఈ ఆర్థిక సంవత్సరం 2023 -24 సం. గాను ఇప్పటివరకు 810 పనులకు 1491.98 కిలోమీటర్లకు గాను 1264.66 కోట్లతో మంజూరు ఇచ్చామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖ నుండి మొత్తం రెండు సంవత్సరాలకు కలిపి 2,392 పనులకు 4,666 కిలోమీటర్లకు 3,323.93 కోట్లు మంజూరు ఇవ్వడం జరిగింది తెలిపారు. అంతేకాకుండా ఇంకా ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయించుకుంటకు గాను 650 కోట్ల విలువ గల పనులకు మంజూరు ఇస్తామని మంత్రి తెలిపారు. గత ఏడాది నియోజకవర్గాల వారీగా ఇల్లందుకు 31 పనులకు 50.11 కిలోమీటర్లకు కాను 44.3 కోట్లు మంజూరు ఇస్తే , ఈ ఏడాది 20 పనులకు 35.65 కిలోమీటర్ల గాను 34.06 కోట్లు మంజూరు ఇచ్చామని తెలిపారు. మహబూబాబాద్ నియోజకవర్గానికి గత ఏడాది 34 పనులకు 61.91 కిలోమీటర్ల గాను, 44.56 కోట్ల మంజూరు ఇస్తే, ఏడాది 80 పనులకు 120.35 కిలోమీటర్ల గాను 92 కోట్లు మంజురు ఇవ్వడం జరిగిందని తెలిపారు. గత ఏడాది డోర్నకల్ నియోజకవర్గానికి 31 పనులకు 60.30 కిలోమీటర్లకు 49.73 కోట్లు మంజూరు ఇస్తే, ఈ ఏడాది 78 పనులకు 127.35 కిలోమీటర్లకు 117.82 కోట్లు మంజూరు ఇచ్చామని తెలిపారు,గిరిజన ఆవాసాల్లో రవాణా వ్యవస్థను మెరుగుపర్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈమేరకు గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి నిధులను మంజూరు చేస్తుందని తెలియజేశారు. చాలా ఏండ్ల నుంచి అధ్వాన్నంగా మారి రాకపోకలకు కష్టంగా ఉన్న తండాలకు బీటీ రోడ్లు మంజూరు కావడంతో ఆయా తండాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.lతెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి రహదారుల పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉండేదని అన్నారు. జాతీయ రహదారులు చాలా తక్కువగా ఉండేవని, అన్ని రోడ్లు కనీసం మరమ్మతులకు కూడా నోచుకోకుండా గుంతలు పడి, రాకపోకలకు ఇబ్బందికరంగా ఉండేవని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నాయకత్వంలో రహదారుల మహార్దశ వచ్చిందని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. రహదారుల అభివృద్ధిని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చిందని తెలిపారు. సమైక్య పాలనలో జిల్లాలోని అత్యధిక గ్రామాలకు రోడ్లులేని పరిస్థితి ఉండేది. అరకొర నిధులను మాత్రమే కేటాయించేవారు, కనీసం రోడ్డ మరమ్మతులకు కూడా నిధులివ్వని దుస్థితి ఉండడంతో గుంతల రోడ్లతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొని ఉండేది. కానీ సిఎం కేసీఆర్ 9 ఏండ్లలలో రోడ్ల అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు కేటాయించారని పేర్కొన్నారు. త్వరలోనే టెండర్ల ప్రక్రియ ను పూర్తిచేసి పనుల ప్రారంభానికి అవసరమైన చర్యలను చేపట్టాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు.ఈ సమీక్ష సమావేశంలో శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ శశాంక,
అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో అలివేలు, పి.ఆర్. ఈఈ సురేష్, ఆర్ అండ్.బి. ఈఈ తానేశ్వర్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ హేమలత ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.