
విద్యుత్ ఘాతంతో బైక్ మెకానిక్ మృతి
మండలంలోని వల్లాపురం గ్రామానికి చెందిన షేక్ రహీం విద్యుత్ ఘాతంతో మృతి చెందిన సంఘటన గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే వల్లాపురం గ్రామానికి చెందిన షేక్ రహీం గ్రామంలో బైకు మెకానిక్ గా వాటర్ సర్వీసింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం తమ వృత్తిరీత్యా వాటర్ సర్వీసింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామానికి చెందిన బైక్ మెకానిక్ విద్యుత్ ఘాతంతో మృతి చెందటంతో గ్రామంలో విషాదశాయలు అలుముకున్నాయి.