రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటోన్న సమస్యల పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి, వినతి పత్రం సమర్పించిన టీపీసీసీ అధ్యక్షులు
Hyderabad శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు మరియు టీపీసీసీ బృందం…
ఈ రోజు హైదరాబాద్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్ గారిని కలిసిన టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ
భూమి, వ్యవసాయం, రైతుల సమస్యలపై సీఎస్ కు వినతిపత్రం అందజేశాము.
రైతుల కష్టాలు, సమస్యలను సీఎస్ కు వివరించాం.
కూర్చోవడానికి సచివాలయం లేదు, కలవడానికి సీఎం లేడు.
వివిధ సామాజిక వర్గాల సమస్యలపై కొట్లాడుతున్న సంఘాలకు ఎనిమిదేళ్లుగా సీఎం దర్శనం కలగలేదు.
సీఎం ప్రజలకు అందుబాటులో ఉండాలి. సమస్యలపై దృష్టి సారించాలి.
ధరణి పోర్టల్ నిర్వహిస్తున్నది ప్రభుత్వం కాదు
సీఎం ప్రజల ఆస్తుల వివరాలను ప్రయివేటు కంపెనీలకు దారాదత్తం చేశారు.
వ్యక్తుల ఆస్తుల వివరాల సమాచారం రహస్యంగా ఉంచాలి.
కానీ ప్రయివేటు వ్యక్తులకు, కంపెనీలకు చేతుల్లోకి వెళ్లి దుర్వినియోగం అవుతోంది.
వారిపై చర్యలు తీసుకోవాలని సీఎస్ కు వివరించాం
భూములు ఉన్న ప్రతి ఒక్కరు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి.
24లక్షల ఎకరాల భూముల వివరాలు ధరణిలో కనిపించడం లేదు.
తక్షణమే భూ సమస్యలను పరిష్కరించాలి.
ధరణితో రాష్ట్ర ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతోంది.
ప్రభుత్వం తక్షణమే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం
పోడు భూముల పట్టాలు ఇవ్వకుండా కమిటీలతో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది.
అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూములకు పట్టాలివ్వాలి.
తక్షణమే ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 24న మండల కేంద్రాల్లో రెవెన్యూ కార్యాలయాల వద్ద నిరసన తెలుపుతాం.
ఈ నెల 30న ధరణి బాధితులతో నియోజకవర్గాల్లో నిరసన చేపడతాం
డిసెంబర్ 5న జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల వద్ద ధర్నా చేపడతాం
అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఈ సమస్యలకు పరిష్కారం చూపాలి.
ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో టీఆరెస్,బీజేపీ వివాదాలు సృష్టిస్తున్నాయి.
తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారు.
దాడులు, ప్రతిదాడులతో గందరగోళం సృష్టిస్తున్నారు.
పెట్టుబడులను గుజరాత్ కు తరలించుకుపోయేందుకు మోదీ కుట్ర చేస్తున్నారు.
ఇది తెలంగాణకు తీరని నష్టం చేకూరుస్తుంది.
పంతాలు, పట్టింపులతో కేసీఆర్,మోదీ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు.
రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యం.
ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశంతో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా చేస్తున్నారు.