
చంద్రబాబు అరెస్ట్ అప్రజాశ్వామికం
చంద్ర బాబు నాయుడు అరెస్ట్ కి నిరసనగా షాద్ నగర్ కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ఎంపిడిఓ కార్యాలయంలో నుండి చౌరస్తా వరకు ఆంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శవ యాత్ర నిర్వహించి దిష్టి భోమ్మ దహనం చేశారు.
ఈ సందర్భంగా కమ్మ సేవా సమితి అధ్యక్షులు పాతూరి వెంకట రావు మాట్లాడుతూ.. అత్యంత సీనియర్ నాయకుడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి, జెడ్ ప్లస్ సెక్యూరిటీ తో ఉన్న ప్రతిపక్ష నేత ను అర్ధరాత్రి వేళ అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అని, ఆంధ్ర రాష్ట్రంలో పౌరులకు జీవించే హక్కు లేకుండా, ప్రాథమిక హక్కులను కాలరాయడం, ప్రతిపక్షాల గొంతు నొక్కడం అక్కడి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనకు అద్దం పడుతుందని అన్నారు.
2021 లో నమోదు అయిన కేసు లో FIR లో ముద్దాయి గా పేరు లేదు ,చంద్ర బాబు మీద ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తే ఆ కాఫీ ఇవ్వమని అడిగినా సమాధానం ఇవ్వకుండా, అర్థరాత్రి అక్రమం గా అరెస్ట్ చేయడం,అరెస్ట్ చేసే ఆఫీసర్ ఇన్వెస్థిగేషన్ ఆఫీసర్ కాకుండా, యూనిఫాం లో లేకుండా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయదాన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రజలందరూ కూడా ఖండించాలని కోరుతున్నాము అన్నారు..
ఈ కార్యక్రమంలో కమ్మ సేవా సమితి నాయకులు గుదే వసంత రావు, పినపాక ప్రభాకర్, మలినేని సాంబశివ రావు, బందారుపల్లి నాగేశ్వర రావు, కోళ్ల శివ మోహన్ రావు, శివయ్య, మలినేని శ్రీను, కొడాలి సురేష్, నువ్వుల రమేష్, మాకినేని వెంకట నారాయణ, మక్కపాటి మల్లేశ్వర రావు, రామసుబ్బా రావు, శ్రీదర్, గార్జున, యారాగుంట్ల శ్రీను, కొత్త ప్రభాకర్, సతీష్, కంకల్ శ్రీను,సంజీవ రావు, సత్యనారాయణ, బ్రమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.