నీతి నిజాయితీ నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనమైన మన్నం ప్రసాద్ ను స్మరించుకుందాం
Hyderabadమనం ప్రసాద్ ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం నిడమలూరు గ్రామంలో మధ్య తరగతి దళిత కుటుంబంలో వెంకటసుబ్బమ్మ – వెంకటేశ్వర్లుకు 1959 సెప్టెంబర్ 14న జన్మించాడు. శింగరాయకొండలోని కో. ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో పనిచేస్తున్న సమయంలోనే 2005 సెప్టెంబర్ 10న మన్నం ప్రసాద్‌ను ప్రభుత్వం ఏర్పాటుచేసిన హంతకముఠా నల్లమల నల్లత్రాచుల పేరుతో రాజ్యం హత్య చేసింది. 1991లో ఇదే రోజు గుంటూరు జిల్లా చుండూర్ దళితవాడలో కొమ్మెర్ల అనిల్‌కుమార్‌ను పోలీసులు కాల్చి చంపారు. ‘చుండూరు’ హంతకులను అరెస్టు చెయ్యండని నిరాహారదీక్ష చేస్తున్న కొమ్మెర్ల అనిల్‌కుమార్‌కు అప్పటి నేదురుమల్లి జనార్థన్ రెడ్డి ప్రభుత్వం కాల్చి చంపింది. ప్రాంతాలు, సంఘటనలు, సందర్భాలు వేరైనా రెండు హత్యలు సెప్టెంబర్ 10న జరగడం యాదృశ్ఛికమే అయినప్పటికి ఈ రెండు హత్యలు కులానికి రాజ్యానికున్న సంబంధాన్ని తేటతెల్లం
చేశాయి.
తరతరాలుగా తలదించుకొని బతికిన దళితులు తలెత్తుకొని | ఆత్మగౌరవాన్ని ప్రకటించుకున్న ప్రతి సందర్భంలో అగ్రకుల దురహంకారులు ఆ తలల్ని తెగ నరుకుతూనే వున్నారు. కంచికచర్ల నుండి కందికట్కూర్ | వరకు దళితుల నెత్తురే అందుకు సాక్ష్యం. పారిన నెత్తురు ఈ దేశ కులవ్యవస్థ క్రూరత్వాన్ని పదే పదే గుర్తు చేస్తుంది. కారంచేడు, చుండూర్, వేంపెంట, ఖైర్లాంజి లాంటి మారణకాండలు అప్రజాస్వామికమన్నందుకు, పీడిత | కులాలందరూ ఐక్యమై ప్రతిఘటనా పోరాటాలు చేయడం | దళితులపై దాడులు ఆగుతాయన్నందుకు మన్నం ప్రసాదన్ను హత్య చేశారు. ద్వారా మాత్రమే
స్వచ్ఛమైన నవ్వుకి, ఆత్మీయ పలకరింపుకి చిరునామా మన్నం ప్రసాదన్న. ఎదుటివారి కష్టాలను చూసి చలించే సున్నితమైన మనసు. సరళమైన పల్లెభాషలో ప్రజలతో మాట్లాడేవాడు. జీవితం అంటే “ఉద్యోగం, భార్య పిల్లలు మాత్రమే కాదు, అది సమాజంలో ఒక భాగం అని గుర్తించాడు ప్రసాదన్న. అప్పటి నుండి ప్రజల మద్యే ప్రజలను అంటిపెట్టుకొని ఉండేవాడు. 1985లో జరిగిన కారంచేడు ఘటన ప్రసాదన్నను కదిలించింది. కుల వివక్షకు గురై అత్యాచార హత్యలకు బలవుతున్న దళిత పీడిత కులాల ప్రజల తరపున పోరాడాడు. బలహీన వర్గాల సమాఖ్యలో పనిచేశాడు.చేపట్టి కొంతకాలంలోనే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎదిగాడు. కమ్మకుల క్రౌర్యం మెండుగా ఉండే ప్రకాశం జిల్లాలో వారి ఆగడాలకు అడ్డుకట్టవేసే పోరాటాలకు నాయకత్వం వహించాడు. రాజుపాలెం, సింగరాయకొండ, చీమకుర్తి, వై. చర్లపల్లి లాంటి అన్ని ఘటనలపై పోరాడి పీడిత ప్రజలకు న్యాయం అందించాడు. 2005లో రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను అవకాశంగా తీసుకొని మన్నం ప్రసాద్‌ను, కనకాచారిని, మునెప్పును హత్యచేశారు. | కులవివక్ష, హిందూ మతోన్మాదం, సామ్రాజ్యవాదంకు వ్యతిరేకంగా పోరాడే ప్రజలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయోగించిన నిర్బంధ కాండలో భాగంగానే ఆ హత్యలు జరిగాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పాతపల్లి, కందికట్కూర్, రామోజీపేట్ లాంటి ఎన్నో సంఘటనలు జరిగాయి. ఇక్కడి కులాంతర ప్రేమికులు అత్యంత దారుణంగా చంపబడ్డారు. మంథని మధుకర్, ప్రణయ్, రోజా, స్వాతి, నరేష్, శివశంకర్, నాగరాజు లాంటి ఎందరో యువతీయువకుల హత్యలు జరిగాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై, మత మైనారిటీలపై దాడులు పెరిగాయి. గోమాంసం తిన్నారని, ఆవు చర్మం వొలిచారని, | పశువులను కబేలాకు తరలిస్తున్నారనే సాకుతో గోరక్షక దళాలు దళిత, మైనారిటీ ప్రజలపై హింసకు పాల్పడ్డాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత, మైనారిటీలపై, ప్రజాసంఘాల నాయకులపై అణచివేతలు తీవ్రమయ్యాయి. దేశభక్తి, జాతీయత, సంస్కృతి పేర దళిత, మైనారిటీలపై మనువాద మూకల అత్యాచార హత్యలు దేశవ్యాప్తంగా పెచ్చరిల్లిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వారికే దన్నుగా నిలుస్తున్నాయి. దాంతో దళితులు, మైనారిటీల ఆస్తిత్వాలను సైతం సహించలేని హిందూత్వ మూకలు అమయకులపై దాడి చేసి క్రూరంగా హింసించి చంపుతున్నారు. దాన్నే దేశభక్తిగా | కీర్తించే అధికారపార్టీ నేతల వల్ల ఇలాంటి అత్యాచార హత్యలు మరింతగా పెరుగుతున్నాయి. హిందూత్వ దాడులను ఖండిస్తూ బాధితుల పక్షాన పోరాడుతున్న దళిత, ప్రజా సంఘాల నాయకులపై, మేధావులపై అణచివేత తీవ్రం అవుతోంది. ఉపా లాంటి కేసులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో దళితుల భూములన్నీ కబ్జాలకు గురవుతున్నాయి. TRS ప్రభుత్వం నిర్వహించిన భూప్రక్షాళన వల్ల దళితుల భూములు అగ్రకులాలకు బదిలీ అయ్యాయి. అక్రమ కబ్జాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న దళితుల తలలు తెగిపడుతున్నాయి. | తప్ప భూములు దక్కడం లేదు. ప్రభుత్వం, రెవిన్యూ, పోలీస్ అధికారులు అందరూ కబ్జాకోరులకే మద్దతిస్తున్నారు. ఇలాంటి స్థితిలో మన్నం ప్రసాదన్న లాంటి నిజాయితీ, నిబద్ధత కలిగిన నాయకుల అవసరం ఎంతో ఉంది. వ్యక్తిగత బలహీనతలు, స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల ఆకాంక్షలను బలిపెట్టే దళారి, దగుల్బాజీ నాయకులు ఎక్కువవుతున్న స్థితిలో త్యాగాలకు సిద్ధపడుతూ, రాజీలేని పోరాటాలు నడిపే నాయకత్వం కావాలి. అని అన్నారు