
మరిపెడ మండలం కేంద్రంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఎదురుగా అంగన్వాడి టీచర్లు నిరవధిక సమ్మె చేస్తుండగా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ వారితో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు అండగా నిలిచిందన్న విషయాన్ని మరోసారి గుర్తు చేశారు.అంగన్వాడీ టీచర్లకు అత్యధిక వేతనాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరే.ఇటీవలే సీఎం కేసీఆర్ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్‌కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించారు. రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీలుగా మారుస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంగన్వాడీలకు సీఎం కేసీఆర్ మూడు పర్యాయాలు వేతనాలను పెంచారు. ప్రస్తుతం మెయిన్ అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు నెలకు రూ.13,650, మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు రూ.7,600 వరకు రాష్ట్ర సర్కార్ వేతనాలను పెంచిందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో కనీసం అంగన్వాడీల ను ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు.