
సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగుల నిరసన సమ్మె
సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగుల నిరసన సమ్మెకు బహుజన్ సమాజ్ పార్టీ స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ నియోజకవర ఇంచార్జి డా. తాళ్ళపల్లి వెంకటస్వామి సంఘీభావం తెలియజేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సమగ్ర శిక్షా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీతకరించి వెంటనే కనీస వేతనలు అమలు చేయాలని గత 15 సంవత్సరాలుగా జిల్లాలో 427 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్న. విద్యాశాఖలో కీలకంగా ఉంటూ రాష్ట్రంలో విద్యాభివృద్ధికై కృషి చేస్తు అన్ని రకాల అర్హతలు ఉన్నప్పటికి నాన్ టీచింగ్ స్టాఫ్ నుండి మొదలుకొని టీచింగ్ స్టాఫ్ వరకు కేవలం నెలకు 6500 నుండి 9500 వరకు జీతాన్ని తీసుకుంటూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు నేటి వరకు వీరు క్రమబద్ధీకరణకు నోచుకోలేదు అని వారి డిమాండ్
1) రాష్ట్రంలో సమగ్ర శిక్షా ఉద్యోగులందరిని క్రమబద్దీకరణ.
2) క్రమబద్ధీకరించే వరకు కనీస వేతనలు అమలు చేయుట.
3) ప్రతి ఉద్యోగికి జీవిత భీమా 10 లక్షలు, ఆరోగ్య భీమా 5 లక్షల సౌకర్యం కల్పించుటం.
వారి న్యాయమైన డిమాండ్ వెంటనే పరిష్కరించాలని లేదంటే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జఫర్గడ్ మండల అధ్యక్షులు వంగాల కుమార్ గారు, స్టేషన్ ఘనపూర్ బీవీయఫ్ నియోజకవర్గం కన్వీనర్ నీరటి దిపక్ తదితరులు పాల్గొన్నారు.