
పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని
18 నుంచి 22 వరకు జరగబోయే పార్లమెంటు సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు లంజపల్లి శ్రీను మాదిగ అన్నారు మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం ఈ నెల 12 మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో పాల్గొని మాట్లాడారు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు ఈనెల 18 నుంచి జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పాలకొల్లు తో పాటు ప్రతిపక్షాలు కూడా ఎస్సీ వర్గీకరణ కోసం పాలకొలపై ఒత్తిడి తీసుకొచ్చి ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింప చేయాలన్నారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా నాయకులు కొత్తపల్లి అంజయ్య మాదిగ మాతంగి ఏసుబాబు మాదిగ తాళ్ళపాక బాబు మాదిగ కత్తి శ్రీను అశోకు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.