వడ్డెరులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించడంలో గత అధిపత్య పాలకులు పూర్తిగా విఫలమయ్యారని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన వడ్డెరుల రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.వడ్డెరులు విద్య, ఉపాధి,ఆర్థిక,రాజకీయ రంగాల్లో వెనుకబడ్డారని వడ్డెర కుల అభ్యున్నతికి ఏకైక పరిష్కారం రాజ్యాధికారం ఒక్కటేనన్నారు. చట్టసభల్లో అవకాశాలు కల్పించకుండా వడ్డెరలను సామాజిక ఆర్థిక రాజకీయంగా అధిపతి పాలకులు అణిచివేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర అసెంబ్లీలో వడ్డెర సామాజిక వర్గం నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని గుర్తు చేశారు. వడ్డెరులకు రాజకీయంగా న్యాయం చేసే ఏకైక పార్టీ బీఎస్పీ అన్నారు.