
suryapet news
మహాలక్ష్మి దేవాలయం నూతన కమిటీ పర్యవేక్షణలోనే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని గ్రామ సర్పంచ్ దొంగల లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం మండల పరిధిలోని తొగర్రాయి గ్రామంలో మహాలక్ష్మి దేవాలయ ఆవరణలో గ్రామస్తులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామస్తులు అనేకమంది దాతలుగా వ్యవహరించి దేవాలయ నిర్మాణానికి సహకరించారని అన్నారు. ప్రస్తుతం గుడి పూర్తయిన తర్వాత సొంతంగా ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని నిర్మాణానికి సహకరించిన దాతలను అవమానపాలు చేస్తూ ట్రస్టు ద్వారా నిర్వహిస్తున్న నగదు ఎటువంటి లెక్కలు చూపకుండా గుడి మొత్తం నాదే అన్న రీతిలో వ్యవహరిస్తున్నాడు అని ట్రస్ట్ చైర్మన్ గురునాథం మీద గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయానికి ఇచ్చిన భూమి కాకుండా మిగతా రెండు మూడు కుంటల భూమిని ఆక్రమించుకున్నాడని తెలిపారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తున్నాడని తెలిపారు. ఇటీవల నూతన కమిటీని ఎన్నిక చేసామని ఆ కమిటీ ఆధ్వర్యంలో దేవాలయం లో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతం నూతన కమిటీలో అధ్యక్షులుగా గురునాథం ఉంటాడని తెలిపారు. ఇంతవరకు జరిగిన లెక్కలను చూపించాలని లేనిపక్షంలో గ్రామపంచాయతీ గ్రామస్తుల ఆధ్వర్యంలో దేవాలయం నిర్వహణ కార్యక్రమాలు నిర్వహిస్తామని అధ్యక్షుడిగా నేను ఉంటానని ఎంత ఖర్చైనా భరిస్తానని దేవాలయ అభివృద్ధికి గ్రామస్తులు అందరూ కృషి చేస్తున్నారని తెలిపారు. దేవాలయం ఎవరి ఒక్క సొత్తు కాదు అని గ్రామస్తులు ముక్తకంఠంతో తెలిపారు. గ్రామస్తులు వారికి జరిగిన అవమానాలను అవినీతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్ పూసపాటి రామారావు, మాజీ డైరెక్టర్ గాయం శ్రీనివాసరావు, బాల బోయిన పెద్ద వేలాద్రి గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.