కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను పర్మనెంట్ చేయాలి
Hyderabadతెలంగాణ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను పర్మనెంట్ ప్రొఫెసర్లుగా చేయాలని పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ ప్రభుత్వాన్ని కోరుతున్నది గళం న్యూస్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రివర్యులు మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు ఇలా ఉన్న ఉద్యోగస్తులందరినీ ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మారుస్తానని ప్రకటించడం జరిగింది. అయితే పది సంవత్సరాలు కావస్తున్నా ఇచ్చిన హామీలు, వాగ్దానాలు పరిష్కారానికి నోచుకోక అలాగే మిగిలిపోయాయి. కావునగౌరవ ముఖ్యమంత్రివర్యులు ఇచ్చిన వాగ్దానాలను, హామీలను నెరవేర్చుకునే విషయమై, తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో 12 యూనివర్సిటీలలో పనిచేస్తున్న దాదాపుగా 1445 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఉన్న వీళ్లందరిని రెగ్యులరైజ్ చేయాలని ఆర్ట్స్ కాలేజ్ బస్ స్టాప్ దగ్గర 13వ తారీకు నుంచి “పెన్‌డౌన్ మరియు చాక్ డౌన్” పేరుతో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ధర్నా కార్యక్రమమును కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఈనెల నాలుగో(4) తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో నిర్వహిస్తున్నారు. అయితే ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపుగా 380 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు. ఈధర్నా కార్యక్రమంలో OU జేఏసీ ప్రెసిడెంట్ ధర్మతేజ, మరియు జేఏసీ సభ్యులు పల్లా రేష్మ రెడ్డి విజయేందర్ రెడ్డి, హరీష్, అజయ్, రామలింగయ్య, ఉపేందర్, జి వెంకటేశ్వర్లు, రామేశ్వర్, మల్లేశం, రమేష్, సుజాత, వాణి, అశోక్, కృష్ణమూర్తి, ప్రేమ్, కిషోర్, గాయత్రి, స్రవంతి రెడ్డి, మాధవి, ఉమ, సంధ్య, కళ్యాణి, కవిత, మంజుల మొదలగు జేఏసీ కమిటీ మెంబర్స్ తో కలిసి 200 మంది కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొనడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి “పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ” అధ్యక్షుడు వి. సదానంద రెడ్డి మరియు పార్టీ సభ్యులు మద్దతుగా కార్యక్రమానికి విచ్చేసి పూర్తి మద్దతు తెలుపుతూ, సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ యొక్క డిమాండ్స్ న్యాయబద్ధమైనవి, ధర్మబద్ధమైనవి. కావున వీరి డిమాండ్స్ ను తక్షణమే ప్రభుత్వము పరిష్కరించాలని, వీరి న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీరికి న్యాయం జరగని పక్షంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని, ప్రభుత్వ మెడలు వంచైనా వీరికి న్యాయంజరిగేలా చూస్తామని లేని పక్షంలో మా ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే ఇలా ఉన్న ఉద్యోగస్తులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తామని చెప్పడం జరిగింది.