
It is the youth who shape the future of the country. Jayashankar Bhupalapally District SP Pulla Karunakar
గళం న్యూస్ వరంగల్ సెప్టెంబర్ 13. యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని క్రమ శిక్షణ, నిరంతర శ్రమతో ఉన్నత లక్ష్యాలు సాధిం చాల ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి పుల్లా కరుణా కర్ అన్నారు. బుధవారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్ లో యూ త్ అవేర్నెస్ ప్రోగ్రాం లో భాగంగా సుమారు 1000 మం ది యువ విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలు, నివార ణ, ట్రాఫిక్ ఉల్లంఘన, షి టీం, ర్యాగింగ్ వివిధ అంశాలపై అవ గాహన సదస్సు నిర్వహించగా, జిల్లా ఎస్పి పుల్లా కరు ణాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బం గా ఎస్పి మాట్లాడుతూ దేశ భవి ష్యత్తును తీర్చిదిద్దేది యువతే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేది యువతేనని, చెడు వ్యసనాలకు లోనై బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని అన్నారుర్యాగింగ్ కు దూరంగా ఉండాల న్నారు ర్యాగింగ్ అనేది ఒక విష సంస్కృతి అని విద్యా ర్థులు దానిని విడనాడి, జీవితంలో ఉన్నతంగా ఎదిగి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పి అన్నారు. ముఖ్యంగా యువత సెల్ ఫోన్ ను సరైన రీతిలో వినియోగించాలని, సమయాన్ని సద్వినియో గం చేసుకోవాలని పేర్కొన్నారు.సైబర్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలనీ తెలిపారు సైబర్ నేరాల పట్ల ప్రజలు, యువత తగిన అవగాహన కలిగి ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పి తెలిపారు. ప్రజలు, యువత తమ వ్యక్తిగత వివరాలు అపరిచితు లతో పంచుకోవద్దని అన్నారు ఇటీవల కాలంలో కొత్త పద్దతుల్లో మహిళలను యువతను విద్యార్థులను ప్రజలను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారని తగు జాగ్రత్తగా వ్యవహరించాలని ఎస్పి వెల్లడించారు. ఒక వేళ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే పోలీసులను ఆశ్రయించాలని అలాగే వీలయినంత తొందరగా 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం అందించాలని తద్వా రా పోయిన డబ్బులు తిరిగి వస్తాయని ఎస్పి తెలిపా రు యువత అతివేగంగా డ్రైవ్ చేయొద్దు యువత డ్రైవింగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నియ మనిబంధనలు పాటించాలని, తప్పకుండా హెల్మెట్ ధరించాలని అన్నారు ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్లో డ్రై వింగ్ చేసి ప్రాణాలు మీదికి తెచ్చుకోవద్దని ఎస్పీ కరు ణాకర్ కోరారు మత్తుతో భవిష్యత్తును పాడు చేసు కోవద్దు యువత మత్తు పదార్థాలకు బానిసై భవిష్య త్తును పాడు చేసుకోవద్దని మత్తుకు దూరంగా ఉండని ఎస్పీ గారు కోరారు. ఎక్కడైనా మత్తు పదార్థాల సమా చారం తెలిస్తే వెంటనే పోలీసులకు అందించాలని స మాచారం అందించాలని అందించిన వారి పేర్లు గొప్పం గా ఉంచుతామని పేర్కొన్నారు.మహిళలు, యువ తులు షి టీమ్ పోలీసుల సేవలను వినియో గించుకో వాలి మహిళల భద్రత కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వ ర్యంలో షీ టీం విభాగం పనిచేస్తుందని ఆపదలో మహి ళలు, యువతులు, బాలికలు షి టీమ్ పోలీసుల సే వలను వినియోగించుకోవాలని అన్నారు సమస్యలకు చావు పరిష్కారం కాదు జీవితంలో సమస్యలు వస్తా యని, సమస్యలకు చావు పరిష్కారం కాదని, చిన్న చిన్న విషయాలకు యువత ఆత్మహత్య చేసుకోవద్దని, సమస్యలు ఉంటే పోలీసులకు పిర్యాదు చేయాలని అన్నారు. పిల్లల భవష్యత్తు కోసం తల్లిదడ్రులు పరిత పిస్తారని, తల్లిదండ్రుల కలలని నెరవేర్చాలని, ఒక ల క్ష్యం ఏర్పరచుకొని దాన్ని చేరుకునేంతవరకు విర మిం చొద్దని అన్నారు యువత తప్పనిసరిగా ఓటు హక్కు ను వినిగించుకోవాలి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకొని, బాధ్యతగా ఎన్ని కల్లో ఓటు వేయాలని ఎస్పీ కరుణాకర్ పిలుపుని చ్చారు ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీని వాసులు, భూపాలపల్లి డిఎస్పీ ఏ. రాములు, కాటారం డిఎస్పీ జి. రామ్మోహన్ రెడ్డి, జిల్లా పరిధిలోని సీఐలు, SI లు, సుమారు వెయ్యి మంది యువ విద్యార్థులు పాల్గొన్నారు