
అమరవీరుల వార్షికోత్సవ సభ
మునగాల మండలం పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో గురువారం సిపిఎం పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల వార్షికోత్సవ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుర్రి శ్రీరాములు,మండల కార్యదర్శి చందా చంద్రయ్య, గ్రామ కార్యదర్శి నందిగామ సైదులు, పార్టీ సభ్యులు ములకలపల్లి సైదులు,వట్టెపు,చిన్న సైదులు, బ్రహ్మం రావులపెంట వెంకన్న, శ్రీను,నిడిగొండ,శంబయ్య, తదితరులు పాల్గొన్నారు..