వాడ వాడకు కాంగ్రెస్, గడప గడపకు నగేష్ ముదిరాజ్ టిపిసీసీ ప్రధాన కార్యదర్శి
Hyderabadఆత్మీయ ప్రజా పాద యాత్రకు అపూర్వ ఆదరణ:
ఘనస్వాగతం పలికిన ప్రజలు:
టీ పీ సి సి ప్రధాన కార్యదర్శి నగేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో *ఈ నెల 17 న తుక్కుగూడ లో జరిగే సోనియా గాంధీ గారి విజయభేరీ భారీ భహిరంగ సభను విజయవంతం చేయాలని *అచ్యుత్ రెడ్డి మార్గ్, విద్యానగర్, సైచరన్ కాలనీ, నాగసాయి కుంట,అడిక్ మెట్ డివిజన్ లో “ఆత్మీయ ప్రజా పాద యాత్ర ” నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నగేష్ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సాకారం చేయడంకోసం, సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేసి భవిష్యత్తుకు బాటలు వేశారు కానీ
రాష్ట్రంలో రాక్షస కుటుంబ పాలన నడుస్తున్నదని, కేసీఆర్ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో పల్చబడి ప్రజల విశ్వాసం కోల్పోయిందని, ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి అణిచివేత, కక్షపూరిత పద్ధతిలో కేసీఆర్ తన రాజ్యాన్ని నిర్వహించి కుట్రలు, కుతంత్రాలు, కుటిల నీతితో ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నారని అన్నారు. తెలంగాణ సాధించుకున్న ప్రయోజనాలు ప్రజలకు దక్కాలంటే, ఏ ఆశయాలతో అయితే తెలంగాణ ఏర్పాటు చేశారో, వాటిని సాధించి ప్రజలకు సమన్యాయం చెయ్యాలంటే, తిరిగి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందే అని అన్నారు, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో బిఆర్ఎస్ పార్టీ విఫలమైందని, ప్రజల్ని ఐక్యంచేసి రాబోయే ఎన్నికలలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించాలని, కాంగ్రెస్ పార్టీ జెండా ఈ గడ్డ మీద ఎగురవేయాలని, “ఆత్మీయ ప్రజా పాదయాత్ర” పేరుతో పాదయాత్ర ప్రారంభించామని అన్నారు నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రాణత్యాగాలపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో భారాస ప్రభుత్వ హయాంలో ప్రజల కలలు సాకారం కాలేదని తెలిపారు. రాష్ట్రాన్ని కొందరు తమ సొంత జాగీరుగా మార్చుకుని కొత్త జాగీర్దార్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్న నాయకులకు మాత్రమే నీళ్లు, నిధులు అందుతున్నాయని కొలువులూ వారి బంధువులు, స్నేహితులకే దక్కుతున్నాయని ఆక్షేపించారు రాష్ట్రం నుంచి కేసీఆర్ ను సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
ఈ పాదయాత్రలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు వై శ్రీనివాస్, రాజు, వర్మ, వరదరాజు, నాగసాయి, ఆనంద్, రాములు, పర్వతాలు, ఉదయ్, మహమ్మద్ పాషా, గోవర్ధన్ సత్య, మధు, వెంకటేష్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.