వైశ్య జాతి వైభవాన్ని పునరుద్ధరించడంలో, ఉన్నత శిఖరాలకు చేర్చడంలో యువత పాత్ర కీలకమని వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్త అన్నారు. లోగో ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాచం సత్యనారాయణ గుప్త మాట్లాడుతూ వైశ్య యువతను బలోపేతం చేయటంతో పాటు వారి భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేయడమే వైశ్య యూత్ ఫోర్స్ లక్ష్యమని స్పష్టం చేశారు. త్వరలోనే వైశ్య యూత్ ఫోర్స్ ఆవిర్భావ సభ ఏర్పాటు చేయనున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నేలంటి మధు, కాచం సాయి, సముద్రాల నిఖిల్,దివ్వెల వెంకటేశ్వర్లు, కాచం అభిషేక్, తేలుకుంట వైష్ణవి, బున్న నవ్య శ్రీ, చీకటిమల్ల రవళిక , బండారు భార్గవి, వాసా నిఖిల్, భార్గవ్, సాయి వినీత్, బున్న సంతోష్, సాయి కిరణ్ , సుశిల్, శశాంక్ తదితరులు పాల్గొన్నారు.