జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మంజూరైన ఎనిమిది బస్ షెల్టర్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో అనేక సెంటర్లు ఉండి బస్సు షెల్టర్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు. ఇట్టి విషయాన్ని పాలకవర్గం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే 8 బస్ షెల్టర్లు మంజూరు చేయడం జరిగింది. బస్ షెల్టర్లు నిర్మాణం చేపడుతున్న క్రమంలో ఈ రోజు ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర రావు పనులను పర్యవేక్షించారు. త్వరగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఒకటవ వార్డు కౌన్సిలర్ వారా రవి తదితరులు పాల్గొన్నారు.