
warangal news aururi ramesh telugu news
లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియ జేసిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ …
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు కేటీఆర్ నాయకత్వన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దీక్ష, ఎందరో మహిళామణుల పోరాటం వల్లనే నేడు లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టారని మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కవిత 47 పార్టీలను ఐక్యం చేశారని, మార్చి 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్ష కూడా చేపట్టారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. దేశంలో మహిళా బిల్లు అంశం చర్చకు తీసుకొచ్చిన ఘనత ఖచ్చితంగా కవితకే దక్కుతుoదని అన్నారు.