
భద్రాచలంలోని గోదావరి కరకట్ట గణేష్ నిమజ్జన ఘాట్ వద్ద రోటరీ ఇన్ భద్ర ఆధ్వర్యంలో నిమజ్జన ఘాట్ వద్ద పని చేస్తున్న సిబ్బంది కోసం పాలు, టి, బిస్కెట్స్ స్టాల్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్నిరోటరీ ఇన్ భద్ర అధ్యక్షులు జయంత్ కుమార్ దాస్ మరియు పట్టణ సీఐ నాగరాజు రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ SI మధుప్రసాద్,ట్రాఫిక్ SI శ్రీనివాస్, ఐటీసీ అడ్మిన్ మేనేజర్ చెంగలరావు,కార్యదర్శి గోవిందరావు, ఐటిసి కాంట్రాక్టర్ పాకాల దుర్గాప్రసాద్, Ln గాదె మాధవరెడ్డి. షేక్ అజిమ్,తాళ్లపూడి రాము,పరిమి సోమశేఖర్,ఎడమకంటి సుధాకర్ రెడ్డి,ప్రభాకర్ గుప్తా,మహా లక్ష్మి, మూర్తి, తదితరులు పాల్గొన్నారు.