
మణుగూరు: ప్రభుత్వ డిగ్రీ కళాశాల మణుగూరు నందు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ మహమ్మద్ అబ్దుల్ కరీం కు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రధానం చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి. విజయలక్ష్మి ఆధ్వర్యంలో “క్యారక్టరైజేషన్ బయెలాజికల్ అండ్ ఫోటో క్యాటలాటిక్స్ యాక్టివిటీస్ ఆఫ్ గ్రీన్ సింథసిస్ టెర్మినాల చెపాలియ ఆక్వాస్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ మీడియేటెడ్ కాపర్ నికెల్ నానో పార్టికల్స్ అండ్ కాపర్ నానో కాంపోజిట్”
అనే అంశంపై చేసిన పరిశోధనకు ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ ప్రధానం చేసింది. కెమిస్ట్రీ విభాగంలో డాక్టరేట్ సాధించిన డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ కరీం ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు. మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థినీ విద్యార్థులు
పీహెచ్డి సాధించిన డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ కరీంను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి శ్రీనివాస్ మాట్లాడుతూ కెమిస్ట్రీ నందు డాక్టరేట్ సాధించిన మహమ్మద్ అబ్దుల్ కరీం వల్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మణుగూరు విద్యార్థులు అనేక నూతన అంశాలను తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని, అదేవిధంగా కళాశాల విద్యార్థులు అధ్యాపకులను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడం ద్వారా విద్యార్థులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని అన్నారు. ముఖ్యంగా డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ కరీం విద్యార్థులకు అనేక విషయాలలో చేయూత అందిస్తూ విద్యార్థుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఐక్యూఎస్సీ కోఆర్డినేటర్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ జూపూడి అనిల్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ కరీం సైన్స్ విభాగంలో కీలకంగా విద్యార్థులను చైతన్యవంతం చేయడంలో విజయవంతమయ్యారని వారి సేవలు సైన్స్ విభాగం అభివృద్ధికి అవసరమని అన్నారు. కళాశాల అధ్యాపకులు డాక్టర్ ఏ అనురాధ, డాక్టర్ ఎస్ రమేష్ బాబు, జి రామ తిరుపతి, పి భాస్కరరావు, సాంబమూర్తి, అశోక్, నాగిరెడ్డి, జబ్బార్, సతీష్, సువర్ణ, స్రవంతి డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ కరీం ను అభినందించారు.