
E69 న్యూస్ శాయంపేట
శాయంపేటలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి విచ్చేశారు. ముందుగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది అనంతరం కీర్తి రెడ్డి మాట్లాడుతూ
తెలంగాణ సాయుధ పోరాట దీరవనిత,ఆ రోజుల్లో నిజాం నిరంకుషత్వ పరిపాలనకు తన కొంగు నడుము చుట్టి కొడవలి చేత పట్టి ఎదురు తిరిగిన దీరవనిత..
ఈ పోరాటంలో తన కొడుకులు అందరినీ పోగొట్టుకున్నది
తన ఆస్తులు అన్ని సర్వనాశనం అయ్యాయి..
అయినా సరే పట్టు వదలని విక్రమార్కుని వలె నీ అంతు చూస్తానని ఒక సాధారణ చాకలి బిడ్డ బలమైన నిజాం నిరంకుషత్వపాలనకు ఎదురు తిరిగి మరో ఝాన్సీ లక్ష్మీబాయి గా నిలిచింది. .
అసలు ఈమె గురించి చదువుతూ ఉంటేనే మన శరీరం పులకిస్తుంది. . అని అన్నారు నేటి యువత ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు అనంతరం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా పత్తిపాక గ్రామంలో. చాకలి ఐలమ్మ చిత్రపటానికి. పూలమాలవేసి నివాళులర్పించి పునము సాంబయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రయారకుల మొగిలి మండల అధ్యక్షులు గడ్డం రమేష్ మండల ప్రధాన కార్యదర్శి నరహరి శెట్టి రామకృష్ణ కిసాన్ మెర్చ్ జిల్లా ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు కానుగుల నాగరాజు సీనియర్ నాయకులు వనము నిర్మల దేవరాజ్ కొడాపక స్వరూప మండల ఉపాధ్యక్షుడు సత్యనారాయణ వైనల వీరస్వామి ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులున్నారు.