తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర 2వ మహాసభలు నవంబర్ 27,28,29 తేదీల్లో నల్గొండ జిల్లా కేంద్రంలో జరగనున్నాయని ఈ మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మోకు కనక రెడ్డి అన్నారు.
బుధవారం నాడు జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల కార్యాలయంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్ను విడుదల చేశారు.ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి భూక్య చందు నాయక్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర సహాయ కార్యదర్శి మోకు కనక రెడ్డి* మాట్లాడుతూ.. నవంబర్ 27న రైతుల భారీ ప్రదర్శన అనంతరం బహిరంగ సభ జరుగుతుందన్నారు.నవంబర్ 28న మహాసభలు ప్రారంభమౌతాయని, ఈ సభలకు అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ అశోక్ దావలే, హనన్మోల్లా, సహాయ కార్యదర్శి డాక్టర్ విజూ కృష్ణన్ పాల్గొని ప్రసంగిస్తారు. రాష్ట్ర నలుమూలల నుండి ప్రతినిధులు, హాజరవుతారు. కౌలు, పాలు, మహిళా, పత్తి, చెరుకు, రైతులు పాల్గొంటారు. రైతుల ఆదాయం ప్రభుత్వ విధానాల ఫలితంగా తగ్గుతుందని అన్నారు. ఉపకరణాల ధరలు విపరీతంగా పెరుగుతున్న స్థితిలో కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలు పెంచకపోవడం వల్ల రైతులు రుణగ్రస్తులు అమవుతున్నారన్నారు. కనీస మద్దతు ధరలను శాస్త్రీయంగా నిర్ణయించకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారన్నారు. మార్కెట్లను కార్పొరేట్ చేతుల్లో పెట్టడానికి ఈనామ్ తెచ్చారు. మార్కెట్ల నుండి ప్రభుత్వం వైదోలిగే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. ఎరువుల సబ్సిడీలు తగ్గించడానికి పిఎం ప్రణామ్ పథకాన్ని తెచ్చిందన్నారు.విత్తన పరిశోధనలను పూర్తిగా విరమించి ఇతర దేశాల నుండి బహుళజాతి సంస్థల టెక్నాలజీని దిగుమతి చేసుకుంటున్నారన్నారు. ఫసల్ బీమా పథకం అమలుకాకపోవడంతో రైతులు ఇబ్బదులకు గురౌతున్నారన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం వాటిల్లినప్పటికీ రైతులకు ఎలాంటి పరిహారం అందడంలేదన్నారు. ధరణి వెబ్సైట్లో తప్పులు ఉండడం వల్ల రైతులకు ప్రభుత్వ పథకాలు వర్తిచడంలేదు. ప్రైవేట్ వడ్డీల భారం భరించలేక పేద, మధ్యతరగతి రైతులు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ప్రైవేట్ వ్యాపారుల వల్ల రైతులు వరి, పత్తి, పప్పు ధాన్యాలు, నూనెగింజల అమ్మకంలో ఏటా 5 వేల కోట్ల నష్టపోతున్నారన్నారు. రైతులు ఎక్కువగా మోసాలకు గురౌతున్నారు. డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడంతో వ్యవసాయ యాంత్రీకరణ చార్జీలు విపరీతంగా పెంచుతున్నారు. రైతులు భరించలేకపోతున్నారు. వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి అమ్మడం వల్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. రైతాంగ పడే ఇబ్బందులను రాష్ట్ర మహాసభలలో చర్చించి భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన చేస్తామని అన్నారు. రైతు ఉద్యమాలకు పోరాటాల పురిటిగడ్డ నల్గొండలో జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి రామవత్ మీట్యా నాయక్,సీనియర్ నాయకులు గురజాల లక్ష్మి నర్సింహ రెడ్డి,నర్సిరెడ్డి, రామచొక్కాo, కోయల్ కార్ గడ్డం శివ, కోయల్ కార్ గడ్డం శ్రీను తదితరులు పాల్గొన్నారు