
పుట్టా రమేష్ గౌడ్ పిఎసిఎస్ చైర్మన్
గళం న్యూస్ సెప్టెంబర్ 28 నడిగూడెం
ప్రజలందరూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని నడిగూడెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ పుట్టా రమేష్ అన్నారు. గురువారం మండలంలోని బృందావనపురం గ్రామంలో శ్రీరామాలయ యూత్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గోలి సునీత వెంకటేశ్వర్లు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరైనారు.