
మంత్రి పర్యటనకు విద్యార్థి సంఘ నాయకుడిని అరెస్ట్ చేయడం ఏంటిది?
అక్రమంగా అరెస్టు చేసిన ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహీమ్ దాదా ను బే షరతుగా విడుదల చేయాలి
ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ
రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహీమ్ దాదా ను అక్రమ అరెస్టు ఫహీమ్ దాదా అక్రమ అరెస్టును ఖండిస్తూ జూలూరుపాడు ముఖ్య కార్యకర్తల సమావేశంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగూలోతు వంశీ మాట్లాడుతూ మంత్రి పర్యటన చేస్తే విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడం ఏంటిదని రౌడీ షీటర్లు ను అరెస్టు చేసినట్టు తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం సరైనది కాదని విద్యార్థి సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించేది ఏఐఎస్ఎఫ్ సంఘం అని ప్రశ్నించే గొంతును తొక్కే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన యూనివర్సిటీ మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రశ్నిస్తారనే రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నులో భయం పుట్టి ముందస్తు అరెస్టులు చేస్తుందని ఆయన అన్నారు విద్యార్థులకు 5700 కోట్లు ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ లను విడుదల చేసి ముందు మీ చిత్తశుద్ధి చాటుకోవాలని ఆయన విమర్శించారు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపాలనుకోవడం రాష్ట్ర ప్రభుత్వం మూర్ఖత్వమని మీ అరెస్టులతో మరింత ఉత్తేజం పెరిగి విద్యార్థుల సమస్యలపై ఉవ్వెత్తున ఉద్యమాన్ని పెంచుతామే తప్ప భయపడే సమస్య లేదని ఇటువంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం మానుకోకపోతే రాబోయే రోజుల్లో సరైన గుణపాఠం చెప్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాలోతు సిద్దు అనిల్ కుమార్ విజయ్ గణేష్ పవన్ తదుపరులు పాల్గొన్నారు