
సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆరోగ్యం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కోటంచ గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి (అక్టోబర్ 2) పురస్కరించుకొని ఆదివారం నాడు స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి సబ్ డివిజన్ తపాలా ఉద్యోగుల అధ్వర్యంలో కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అవరణములో పరిసరాలు పరిశుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భూపాలపల్లి పోస్టల్ ఇన్స్పెక్టర్ భూక్య విజయ్ మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన పరిశుభ్ర ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెయిల్ ఓవర్సీర్స్ నరేష్, సురేష్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లు శివాజీ, అమర్నాథ్, షఫీ మొహమ్మద్, సంతోష్, భాస్కర్ల రాజు తదితరులు పాల్గొన్నారు.