
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చేంతవరకు నిరుద్యోగ భృతిని 3016లు ఇస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో బిఆర్ఎస్ ప్రకటించిందని, హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు పారిశ్రామిక కారిడార్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని హనుమకొండ పర్యటనకు వస్తున్న మంత్రి కేటీఆర్ దానిపై మాట్లాడాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దోగ్గెల తిరుపతి అన్నారు.
హనుమకొండ రాంనగర్ లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో హనుమకొండ పర్యటనకు వస్తున్న కేటీఆర్ కు బహిరంగ లేఖ విడుదల చేశారు.
తొమ్మిదేళ్ల పాలనలో యువతకు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, హామీలతో పబ్బం గడిపిందని, మళ్లీ ఎన్నికల్లో గెలవడం కోసమే హడావిడిగా ప్రకటనలు చేస్తుందని,వరంగల్లో టెక్స్ టైల్ పార్కును ఏర్పాటు చేస్తామని, ప్రారంభించేసి వదిలిపెట్టారు తప్ప, ఇప్పటికీ దానిమీద ప్రస్తావన లేదని, హనుమకొండ నగరంలోని ఎప్పుడో పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ లను ఇప్పటివరకు ఎందుకు పంచడం లేదని, చాలామంది నిరుపేదలు ఎండకు ఎండి వానకు తడుస్తూ వాటి చుట్టూ గుడిసెలు వేసుకొని దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారని, మిగతా చోట్ల ప్రారంభం చేసి ఇక్కడ మాత్రం ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో చాలామంది డిఎస్సీ కోసం ఎదురు చూస్తుంటే నామమాత్రమైన డీఎస్సీ వేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రతి ఏటా లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిందని, మెగా డీఎస్సీ ని నిర్వహించాలని, టీఎస్పీఎస్ బోర్డు ప్రక్షాళన చేయాలి. ప్రతి నియోజకవర్గానికి గురుకులాలు ఏర్పాటు చేశామని ఆర్భాటంగా చెప్పే ప్రభుత్వం వాటికి సొంత భవనాలు ఎందుకు ఏర్పాటు చేయలేదని అన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్మెంటు రాక ఇబ్బందులు పడుతుంటే ఎందుకు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ వీటిపై స్పందించి స్పష్టమైన హామీ ఇవ్వాలని డివైఎఫ్ఐ విజ్ఞప్తి చేస్తుంది. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్, నాయకులు యం .చందు,ఓ .చిరంజీవి సతీష్, కర్ణాకర్ అనీల్ లు పాల్గొన్నారు.