
వరంగల్: పశ్చిమ నియోజకవర్గం లో హంటర్ రోడ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి రేపు కెటి ఆర్ వరంగల్ పర్యటన నేపథ్యంలో దాస్యం వినయ్ భాస్కర్ పై వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా,ఎన్నికలు వస్తున్న సమయంలో హడావిడిగా చేసిన పనులకై శంకుస్థాపనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు…
1.గతంలో ఖాజీపేటలో బస్టాండ్, కోచ్ ఫ్యాక్టరీ, ఇంటర్, డిగ్రీ కాలేజీ ల ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంతవరకు హామీ నెరవేర్చలేదు…
2.రాష్ట్ర ఉద్యోగులకు ఐ ఆర్ పి ఆర్ సి 20% ఇస్తామని చెప్పి 5% ఇచ్చి చేతులు దులుపుకొని, ఉద్యోగస్తులకు 3 డి ఏ లు ఇవ్వకుండా, కనీసం ఉద్యోగస్థులు, పెన్షనర్స్ లకు ప్రతి నెలా 20 వ తారీకు వరకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు….
3.వరంగల్ పశ్చిమలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టినవాటిని కూడా పంచె పరిస్థితి లేదు.డబుల్ బెడఁరూమ్ ఇండ్లలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులుమారినాయి..
4.కాజీపేట ఫాతిమానగర్ లో రెండవ బ్రిడ్జి నిర్మాణం
కోసం ధర్నాలు చేస్తే మా పై కేసులు పెడితే ఇప్పటికి కోర్టుల చుట్టూ తిరుగుచున్నాము.9 సంవత్సరాలనుండి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడం లేదు.ల్యాండ్ అక్యూపేషన్ డబ్బులు ఇవ్వడం లేదు…
5.పశ్చిమలో ఇంతవరకు అండర్ డ్రైనేజి పూర్తి కాలేదు…వరదలు వచ్చిన ప్రతిసారి అడవుడి చేస్తూ కాలం గడుపుతున్నారు.
6.కాకతీయ యూనివర్సిటీ లో phd సీట్లలో అవకతవక లపై విద్యార్థులు ధర్నా చేస్తుంటే VC విద్యార్థులను పోలీస్ స్టేషన్ లలో తీసుకెళ్లి కొట్టియ్యడం వారిపై కేసులు పెట్టడం జరిగింది.. తక్షణమే వీసీ పై చర్యలు తీసుకోవాలి, యూనివర్సిటీ కి కె టి ఆర్ వెళ్లి విద్యార్థుల సమస్యలు పరిష్కారించాలి.
7.కాళోజీ కళా క్షేత్రం గత 9 సంవత్సరాలనుండి నత్త నడకన పనులు చేసి ఇప్పుడు నాణ్యత లేకుండా పనులు హడావిడిగా చేసి ప్రారంభోత్సo చేస్తుండడం…
8.మున్సిపాల్టీ లో కాంట్రాక్టు పనులు చేసి బిల్లు లు రాక కాంట్రాక్టర్స్ ఆత్మ హత్యలు శరణ్యమని, కొత్త పనులు చేయడం లేదు…
9.పశ్చిమ లో ఉన్న స్లమ్స్ లో పట్టాలు ఇస్తామని చెప్పి ఇంత వరకు పట్టాలు ఇవ్వలేదు..
10.ప్రతి డివిజన్లో కమిటీ హాల్స్ కట్టిస్తామని ఇప్పటివరకు కట్టియ్యలేదు..
11.వరంగల్ పశ్చిమ లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఇటీవల ఫాతిమా నగర్ లో దొంగిలించడం జరిగింది…
అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను ఉద్యమంలో వాడుకోని వినయ్ భాస్కర్ ఇప్పుడు వరంగల్ పశ్చిమ ప్రజలను, విద్యార్థులను రాబోయే ఎన్నికలలో మళ్ళీ మోసం చేయడానికి కె టి ఆర్ ను పిలిపించి దొంగ హామీలిచ్చి మోసం చేయడానికి చూస్తున్నారు