
జనగాం: జిల్లా కేంద్రం లోని SRR Degree కళాశాలలో స్వేరో స్టూడెంట్స్ యూనియన్ జనగాం జిల్లా అధ్యక్షులు మాదారపు విజయ్ కుమార్ నేతృత్వం లో విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని గ్రూప్స్ పరీక్షలు సరిగా నిర్వహించలేని TSPSC చైర్మన్ జనార్ధన్ రెడ్డి సస్పెండ్ చేయాలని* విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనికి ప్రభుత్వంమే నైతిక నిబద్ధతో పరీక్షలను పారదర్శకం గా ఎలాంటి అవకతవకలు లేకుండా *వెంటనే TSPSC బోర్డ్ ను ప్రక్షాళన చేసి పరీక్షలను నిర్వహించాలని హెంచరించరు. DSC అభ్యర్థులకు లక్ష రూపాయలు ప్రభుత్వం నష్టపరిహారం అందజేయాలని లేనిచో అన్ని విద్యార్థి సంఘాల నాయకులను కలుపుకొని జనగాం జిల్లా కేంద్రంగా స్వేరో స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దశల వారిగా నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో VSF రాష్ట్ర అధ్యక్షులు రాజు,MRPS రాష్ట్ర ప్రధనకార్యదర్శి రాగల్ల ఉపేందర్,సల్ల మహేష్, TGVP టౌన్ అధ్యక్షులు అజయ్,SFI జనగాం జిల్లా అధ్యక్షులు సందీప్,TGVP జిల్లా కార్యదర్శి కౌశిక్,BSYJAC ఇంఛార్జి పవణ్,SFI దర్మబిక్షం జనరల్ సెక్రెటరీ,MRPS జనగాం జిల్లా అధ్యక్షులు రాజశేఖర్,BSYJAC నరేష్, రాంప్రసాద్ ,SFI చందు,SSU జనగాం జిల్లా మహిళా కమిటీ ఇంఛార్జి స్వాతి ,SSU సందీప్,SSU గణేష్, SSU జీడి అనుఫ్, తదితరులు పాల్గొన్నారు.