
సూర్యాపేట జిల్లా మునగాల మండలం కొక్కిరేణి గ్రామం నుండి మొదటి సివిల్ కానిస్టేబుల్ పోస్టుకు ఓపెన్ క్యాటగిరిలో యల్లావుల సుధీర్ ఎంపిక కావడం జరిగింది. పేద కుటుంబంలో పుట్టిన సుధీర్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో హైద్రాబాద్ లో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. గ్రామం నుండి మొదటి కానిస్టేబుల్ ఉద్యోగం పొందిన సుధీర్ గ్రామానికి మంచి పేరు తెచ్చినందుకు గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.