
గళం న్యూస్ నడిగూడెం, అక్టోబర్ 6,
తాటిచెట్టు పై నుండి పడి గీతకార్మికునికి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం మండలంలోని చెన్నకేశవపురం లో చోటు చేసుకుంది. వివరాలు పరిశీలిస్తే గ్రామానికి చెందిన గీత కార్మికుడు బోలగాని రమేష్ (33) వృత్తి లో భాగంగా తాడిచెట్టు ఎక్కి కల్లు గిస్తున్న సందర్బంలో పట్టు తప్పి తాటి చెట్టు పై నుండి కింద పడటం తో తీవ్ర గాయాలు అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కు తరలిచినట్లు వారు తెలిపారు.గీత కార్మికునికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, ప్రభుత్వం ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని వారు కోరారు.బాధిత కుటుంబాని గీత కార్మికుల సొసైటీ అధ్యక్షుడు గోసుల నరసయ్య, మండల బిజెపి ప్రధాన కార్యదర్శి మేకల నాగరాజు, ఉప సర్పంచ్ అనంతుల ఉపేందర్, వార్డ్ నెంబర్ గోవర్ధన్, కొండ ఉపేందర్,శీలం వీరయ్య, కొత్త ఉపేందర్ పరామర్శించారు.