
pravalika news
బిఆర్ఎస్ ను ఓడిస్తేనే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తిరుపతి
హనుమకొండ: రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత వల్లే తొమ్మిదేళ్లలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని బిఆర్ఎస్ ను ఓడిస్తేనే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయని, యువత సిద్ధం కావాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) హనుమకొండ జిల్లా కార్యదర్శి డి.తిరుపతి పిలుపునిచ్చారు.
హనుమకొండ సుందరయ్య భవన్ లో డివైఎఫ్ఐ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడారు. గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ పాలనలో నిరుద్యోగ యువతకు జరిగింది ఏమీ లేదని, అదిగో ఉద్యోగం ఇదిగో ఉద్యోగాలు ఉద్యోగాల జాతర అని ప్రకటనలతో మోసం చేసింది తప్ప, ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. మరోసారి అధికారంలోకి రావడం కోసంహడావిడిగా నోటిఫికేషన్లు విడుదల చేయడమంటేనే యువతను మోసం చేసినట్లని, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది నిరుద్యోగులు, ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకున్నారని, అవి ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఉద్యోగాలు రాకపోవడం శోచనీయమన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం సెంటిమెంటును వాడుకొని పబ్బం గడుపుతుందని, దానివల్ల యువతకు జరిగేది ఏమీ లేదన్నారు. యువత ఆత్మహత్యలకు లోను కాకూడదని, నియంత పాలనకు చమరగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్, జిల్లా ఉపాధ్యక్షులు మంద సుచందర్, జిల్లా సహాయ కార్యదర్శులు మంద సురేష్, ఓర్సు చిరంజీవి, జిల్లా నాయకులు సముద్రాల అనిల్, మౌనిక, శివరాత్రి కరుణాకర్, అనంతగిరి దేవేందర్, రాచపూడి యువన్, యం. అశోక్, యం. సతీష్, లు పాల్గొన్నారు.