
జనగామ: రాష్ట్రవ్యాప్తంగా అఖిలపక్షలు ప్రజాసంఘాల పిలుపుమేరకు జిల్లా కేంద్రంలో సడక్ బంద్ రాస్తారోకో కార్యక్రమం విజయవంతంగా జరిగింది
సిపిఎం సిపిఐ కాంగ్రెస్ సిఐటియు ఎస్ఎఫ్ఐ విద్యార్థి యువజన సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు మాట్లాడుతూ ప్రస్తుత బోర్డు చైర్మన్ తో సహా TSPSC సభ్యులను తొలగించి, TSPSC చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం కొత్త సభ్యులని నియమించాలని అన్నారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు DSC పోస్టుల సంఖ్యను ముఖ్యమంత్రి అసెంబ్లీ లో ప్రకటించిన విధంగా 13500 కు బ్యాక్ లాగ్ పోస్టులు కాకుండా అదనంగా పెంచాలన్నారు
పరీక్షల రద్దుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాధ్యత వహించి పరీక్షలు రాసిన అభ్యర్థులకు మూడు లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం సిపిఐ కాంగ్రెస్ విద్యార్థి యువజన కార్మిక సంఘాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు .