
మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షులుగా క్యాతూరి శివన్న
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా యూత్ అధ్యక్షులు బుద్దారం శివకుమార్ అధ్యక్షతన 29-10-2023 ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర కో కన్వీనర్ ఇటిక్యాల బండలయ్య హాజరై మాట్లాడుతూ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుతామని మ్యానిఫెస్టోలో పెట్టి అమలుచేస్తామని హామీ ఇచ్చే పార్టీకే మన మద్దతు తెలుపుదామని రాష్ట్ర రజక కులస్తులను కోరారు.
మహబూబ్నగర్ జిల్లా నూతన నియామకంలో బాగంగా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షులుగా క్యాతూరి శివన్న ,ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా జలనీల నాగన్న,జిల్లా అధ్యక్షులుగా చాకలి రాజు ,జిల్లా ఉపాధ్యక్షులుగా చాకలి బాస్కర్ ,జిల్లా ప్రధాన కార్యదర్శిగా చాకలి సతీష్ లను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈసందర్భంగా నూతన సభ్యులు మాట్లాడుతూ మాపై నమ్మకంతో అప్పజెప్పిన భాధ్యతను సక్రమంగా జాతి శ్రేయస్సుకై ఎస్సీ రిజర్వేషన్ కై ,రజకుల హక్కులకై రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పనిచేస్తామని అదేవిధంగా రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా యూత్ కార్యదర్శి సిహెచ్. మనోహర్, గోవిందమ్మ, గోవిందమ్మ ,లలిత, నాగలక్ష్మి, అనిత, నాగమణి, నాగరాజు, మైబు, కుమార్, నర్సింలు, యాదయ్య, అశోక్, రాజు తదితరులు హాజరయ్యారు