
ఈరోజు స్టేషన్గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి స్థానిక ఆర్డీవో కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సింగపురం ఇందిర నామినేషన్ దాఖలు చేశారు
అనంతరం శివాజీ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన మీటింగ్ కు ముఖ్యఅతిథిగా వరంగల్ పార్లమెంట్ ఇంచార్జ్ ఉత్తమ్ రావు దాల్వి మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు సిరిసిల్ల రాజయ్య స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ కైలాస్ నేత కార్యక్రమాన్నిఊ దేశించి శ్రీమతి సింగపురం ఇందిర గారు మాట్లాడుతూ ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది నా కుటుంబ సభ్యులు లాగా నన్ను భావించి నా నామినేషన్ దాఖలు కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు రానున్న రోజులలో కూడా ఇలాగే నన్ను ఆదరించగలరని కోరుతున్నాను కేసీఆర్ ప్రభుత్వం గడచిన పది సంవత్సరాలలో దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలకు తిన ఏ ఒక్క పథకం కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదు మళ్ళీ ఇప్పుడు ఈ నియోజకవర్గం టిఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి మళ్లీ దీవించండి అభివృద్ధి చేస్తానని మాయమాటలు చెబుతున్నాడు గడిచిన 30 ఏళ్లలో ఏ పార్టీ అధికారంలో ఉన్న తను కూడా ఆ పార్టీలో ఉన్నాడు అప్పుడు గుర్తు రానటువంటి అభివృద్ధి ఇప్పుడు ఎలా చేస్తాడు చెప్పాల్సిన అవసరం ఉంది మీరు అభివృద్ధి చేసిన అంశాలు ఏమీ లేవు మూడు నెలల క్రితం మీరు కూడా స్టేషన్ ఘనపూర్ లో ఏ లాంటి అభివృద్ధి జరగలేదని పత్రిక ముఖంగా చెప్పిన విషయం నిజం కాదా దీనిపై మీరు ఎక్కడైనా చర్చ వేదికపై మాట్లాడేందుకు మేము సిద్ధంగా ఉన్నాము ఆనాడు విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా స్టేషన్గన్పూర్ నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజ్ తీసుకురాలేని మీరు ఈనాడు అభివృద్ధి చేస్తాననడం చాలా విచిత్రంగా ఉంది కావున రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ పథకాలను తప్పక అమలు చేస్తామని మరియు స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కావాలో అలాంటి అభివృద్ధి చేసి చూపెడతానని ఈ సభ ముఖంగా మీకు మాట ఇస్తున్నాను
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల అధ్యక్షులు బ్లాక్ అద్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులు మహిళా నాయకురాలు గ్రామ శాఖ అధ్యక్షులు బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు