
జనగామ పట్టణంలోని బాణాపురం 5వ వార్డులో సిపిఎం జనగామ MLA అభ్యర్థి మోకు కనకారెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించగా కాలనీ ప్రజలు ఇంటింటికీ వెల్లగా మంగళ హారతులుతో స్వాగతం పలికి పూలమాలలు వేసి శాలువతో సత్కరించి ఈనెల 30వ తారీఖున జరగనున్న శాసనసభ ఎన్నికలలో ప్రజా సమస్యల ఎజెండాగా జనగామ నియోజకవర్గంలో పోరాటాలు చేసిన అభ్యర్థి ప్రజల తరఫున పేదల పక్షాన అనునిత్యం ఇళ్ల స్థలాల సమస్యలు శివారు కాలనీల అభివృద్ధి కోసం పోరాడుతున్న సిపిఎం అభ్యర్థి అయిన మోకు కనకారెడ్డి కే ఓట్లు వేస్తామని ప్రజలు తెలిపారు.
ఈసందర్భంగా సిపిఎం జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మోకు కనకారెడ్డి మాట్లాడుతూ డబ్బు సంచులతో మద్యం బాటిల్లతో ప్రజల ముందుకు వస్తున్న బిఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని ప్రజలను కోరారు. బిఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి నల్లగొండ వరంగల్ ఖమ్మం జిల్లాల MlCగా నేడు కొనసాగుతున్నాడని రెండు పర్యాలు ఎమ్మెల్సీగా గెలిచి జనగామ ప్రజలకు ఏమి ఓరుగపెట్టారని ఎన్నడైనా నిరుద్యోగుల ఉద్యోగుల సమస్యలు ప్రజల సమస్యలు మండలిలో మాట్లాడలేదని అలాంటి వారికి ఓటేయడం అంటే దొర గడికి మల్ల బానిసని పంపినట్లే అని అన్నారు.అలాగే అనేక పార్టీలు మారిన కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాపరెడ్డి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాడు తప్ప చిత్తశుద్ధిగా ప్రజల పక్షాన పోరాడిన సందర్భం లేదని అన్నారు. అందుకోసం గత 30 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమంలో ఉండి విద్యార్థి యువజన రైతాంగ కార్మిక పేద ప్రజల హక్కుల కోసం వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న నియోజకవర్గ పట్ల సంపూర్ణ అవగాహన కలిగిన ఉన్న నాసుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని జనగామ నియోజకవర్గంలో అవినీతి అక్రమాలకు భుకబ్జాలకు తావు లేకుండా అభివృద్ధి కోసం నీతివంతమైన పాలన చేస్తానని కనకారెడ్డి ఈసందర్భంగా అన్నారు..
ఈకార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ పట్టణ కమిటీ సభ్యులు పల్లెర్ల లలిత పందిళ్ళ కళ్యాణి భునాద్రి వెంకటేష్ కంటిస్ మల్లేష్ ఔచర్ల పద్మ బిట్ల లక్ష్మి L సుగుణ తదితరులు పాల్గొన్నారు….