
mulugu news telugu
పేదలకు అండగా ఉంటున్న బ్లడ్ డోనర్స్ సేవలు అమూల్యం:- హోండా షో రూమ్ ఎండీ తజోద్దీన్
గఫ్ఫార్ కుటుంబం కు అండగా ఉంటాం:- BRS మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఖాజా పాషా
పేదలకు అండగా ఉంటున్న దాతలకు రుణపడి ఉంటాం:- కునూర్ మహేష్
ఏటూరునాగారం గ్రామంకు చెందిన ఎండీ గఫ్ఫార్ హోండా షో రూమ్ లో ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అతని ఆరోగ్యం బాగా లేక హాస్పిటల్ వెళ్లగా అక్కడి వైద్యులు మెదడులో రక్తం గడ్డ కట్టింది అని మెరుగైన వైద్యం చేయించుకోవాలని సూచించారు. తన దగ్గర వైద్య ఖర్చులకు డబ్బులు లేక ఇబంది పడుతున్న విషయం ను బ్లడ్ డోనర్స్ కు తెలియ చేయగా, బ్లడ్ డోనర్స్ దాతల ద్వారా 87,000/- సేకరించి వారి కుటుంబంకి అందించట జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధులుగా వచ్చిన ఎండీ తజోద్దీన్, కునూర్ మహేష్, ఎండీ ఖాజా పాషా వారికీ 87,000/- రూపాయల చెక్ అందించి, గఫ్ఫార్ కుటుంబంకు దైర్యం చెప్పి అండగా ఉంటాం అని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ డోనర్స్ సయ్యద్ వహీద్, బండపల్లి సంతోష్, మెరుగు రఘు, శ్రీరామ్ సురేష్, దామెర ప్రశాంత్, యాఖుబ్ పాషా,దొడ్డి సాంబయ్య పాల్గొన్నారు.