
janagaon news
జనగామ జిల్లా కేంద్రంలో ఐద్వా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కమిటీ సమావేశం స్థానిక కమిటీ ఆఫీసులో జరిగింది.ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి షబానా మరియు అధ్యక్షులు ఇరి అహల్య ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారని,జనగామ జిల్లాలో బస్సు సౌకర్యం లేని ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు.ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులు హైవే రోడ్లపై మాత్రమే ఆపుతున్నారని అన్నారు.గ్రామాల నుండి విద్యార్థులు కాలేజీకి స్కూల్ కి వెళ్లే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.అదనపు బస్సులను కేటాయించాలని డిమాండ్ చేశారు.500 గ్యాస్ సిలిండర్ ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు వర్తించదని అంటున్నారని, గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబానికి 500 రూపాయలకే అందించాలని కోరారు.డ్వాక్రా పొదుపు గ్రూపులో సభ్యుల నుండి గతంలో అభయ హస్తం డబ్బులు కట్టించుకున్నారు వారికి డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు.అభయ హస్తం ప్రజా పాలన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన ప్రతి కుటుంబానికి 5 గ్యారెంటీలను అమలు చేయాలని గత తొమ్మిది సంవత్సరాలుగా రేషన్ కార్డు లేని వారికి వెంటనే అందించాలని అన్నారు.ఈ సమావేశానికి వర్కింగ్ ప్రెిడెంట్ చీర రజిత టౌన్ కార్యదర్శి పొన్నాల ఉమా అధ్యక్షులు కొండ వరలక్ష్మి బూడిద అంజమ్మ,శ్రీలత గడ్డం చంద్రకళ,తబస్సుం బిట్ల లక్ష్మి,మహేశ్వరి పాల్గొన్నారు.