
hanmakonda news
గళం న్యూస్ స్టేషన్ హన్మకొండ
నాయి బ్రాహ్మణులకు మరియు రజకులకు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి కరెంటు సబ్సిడీని కొనసాగిస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉచితంగా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని సెలూన్స్ మరియు ధోబిగాట్లకు 250 యూనిట్ల ఉచిత కరెంటు సబ్సిడీ నాయి బ్రాహ్మణులకు మరియు రజకులకు వారి సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అని తెలిపారు.మంత్రి పొన్నం ప్రభాకర్ నాయి బ్రాహ్మణులకు,రజకులకు ఉచిత కరెంట్ ప్రకటించడం పట్ల హన్మకొండ నాయి బ్రాహ్మణ యువసేన హర్షం వ్యక్తం చేస్తూ మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కొలిపాక సతీష్ ఆధ్వర్యంలో హనుమకొండ నాయి బ్రాహ్మణ యువసేన జిల్లా అధ్యక్షుడు సింగారపు శ్యామ్,సూత్రపు కిరణ్,మొగిలిచర్ల ప్రసాద్,చందర్లపాటి మని కుమార్ జంపాల శ్రీకాంత్, పుట్టపాక పవన్ తదితరులు పాల్గొన్నారు.