
jayashanker bhupalapalli news e69news
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తాసిల్దార్ కార్యాలయం ముందు సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక 2024, క్యాలెండర్ ను, రేగొండ తాసిల్దారు సత్యనారాయణ స్వామి,ఆవిష్కరించారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, స,హా, చట్టం జిల్లా ఉపాధ్యక్షుడు మండల యుగంధర్ గౌడ్ ఆధ్వర్యంలో, తాసిల్దార్, సత్యనారాయణ స్వామి రెడ్డి , మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం, ప్రజల చేతులు వజ్రాయుధం,అవినీతి అక్రమాలకు తావు లేకుండా, ప్రభుత్వ కార్యాలయంలో, వెలుగు తీసేందుకు ఈ చట్టం సామాన్యుడికి ఒక ఆయుధంలా,ఉపయోగపడుతుందని ఆయన అన్నారు, డిప్యూటీ తాసిల్దార్ ఎండి రజాక్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం , ప్రజలందరూ సమాచారాన్ని కోరితే ప్రభుత్వ అధికారులు సమాచారం ఇవ్వాల్సిందే,సమాచార హక్కు చట్టం ప్రతి పౌరుడు చట్టాన్ని ఆయుధంగా వినియోగించుకొని ప్రతి ఒక్కరూ అవినీతి నిర్మూలనలో నడుము బిగించాలని, ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా చూడవలసిన బాధ్యత ప్రజల, అందరిపై ఉందని డిప్యూటీ తాసిల్దారు ఎండి రజాక్, అన్నారు కార్యక్రమంలో,మండల అభివృద్ధి అధికారి సురేందర్, సీనియర్ అసిస్టెంట్ ,స్పందన, రెవెన్యూ సిబ్బంది, సహా,చట్టం, మండల కార్యవర్గ ,సభ్యులు బాబురావు, తాళ్లపల్లి రమేష్ గౌడ్ తదితరులు ,పాల్గొన్నారు.